vakeel saab teaser : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘వకీల్ సాబ్’.. రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతున్న టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు పవన్. సంక్రాంతి కానుకగా...

vakeel saab teaser : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వకీల్ సాబ్.. రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతున్న టీజర్

Updated on: Jan 14, 2021 | 9:42 PM

vakeel saab teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు పవన్. సంక్రాంతి కానుకగా పవర్ ప్యాక్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. పవన్ చెప్పిన డైలాగులు, పవన్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బమ్స్ తెప్పించింది.

ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్ళింది. బాలీవుడ్​ హిట్ సినిమా ‘పింక్’​ రీమేక్​గా ‘వకీల్‌ సాబ్’‌ తెరకెక్కించారు. ఇందులో పవన్​ న్యాయవాదిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్ కథానాయిక. అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.ఇక ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన కొద్దిగంటల్లోనే రికార్డు వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటేసింది ఈ టీజర్.. మరి ఇంకెన్ని రికార్డులను ఈ టీజర్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’.. పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్..!

Samuthirakani : ‘ఆర్ఆర్ఆర్’ లో అవకాశం అలా వచ్చింది… ఆసక్తికర విషయాలు వెల్లడించిన సముద్రఖని