West Bengal election 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందీగ్రామ్‌లో ఇవాళ జోరుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నందీగ్రామ్‌లోని ఓ పోలింగ్ బూత్‌ను సందర్శించిన టీఎంసీ అభ్యర్థి సీఎం మమతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఉన్నట్టుండీ ఒక్కసారి గవర్నర్ ఫోన్ కాల్ చేశారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌తో మాట్లాడారు. గవర్నర్‌కు ఫోన్ చేసిన దీదీ.. స్థానిక ఓటర్లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు చేశారు.
నందిగ్రామ్ నియోజకర్గంలో దీదీకి పోటీగా బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తృణమూల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని ఆమె ఆరోపించారు. వాళ్లంతా బీహార్, యూపీ నుంచి వచ్చారని, వారికి కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని సీఎం మమతా ఆరోపించారు. నందీగ్రామ్ సమీపంలో ఉన్న బయాల్ గ్రామంలో దీదీ పర్యటించారు. వీల్‌చైర్‌పైనే ఆమె టూర్ చేశారు. ఉదయం నుంచి ప్రచారం నిర్వహిస్తున్నానని, స్థానిక ఓటర్లను వాళ్లు అడ్డుకుంటున్నారని, ఈ నేపథ్యంలో తమకు ఫిర్యాదు చేస్తున్నట్లు దీదీ ఫోన్‌లో గవర్నర్‌కు వివరించారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ఆమె కోరారు.
ఫోన్‌లో ఆమె గవర్నర్‌తో మాట్లాడుతూ.. “ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు. ఈ ప్రాంతంలో ఉండటానికి వెలుపల ప్రజలతో శాంతిభద్రతల విచ్ఛిన్నం ఉంది. వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారికి భద్రతా సిబ్బంది పక్షపాతంతో వ్యవహరిస్తారని ఆరోపించారు.
మరోవైపు బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పార్టీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. “బిజెపి కార్యకర్తుల 6, 7, 49, 27, 162, 21, 26, 13, 262, 256, 163, 20 నెంబర్ కలిగిన బూత్‌లోకి ప్రవేశించింది. బీజేపీ కార్యకర్తలు ఈవీఎంను నియంత్రిస్తున్నారని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.