ఎన్నిక కమిషన్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్.. వ్యవహారశైలి దయనీయం అంటూ ఈసీ ఫ్యానెల్‌కు లేఖ

TMC alleges in letter to poll panel: కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఆమె తప్పుబట్టారు. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ తరుఫున ఈసీకి లేఖ రాశారు.

ఎన్నిక కమిషన్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్.. వ్యవహారశైలి దయనీయం అంటూ ఈసీ ఫ్యానెల్‌కు లేఖ
Mamata Banerjee

Updated on: Apr 14, 2021 | 8:29 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన 24 గంటల నిరసన దీక్ష ముగిసింది. దీక్ష విరమణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. “మోదీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అబద్ధాల కోరు అన్న మాట అన్ పార్లమెంటరీ పదం అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నేను అంటాను. ఆయన చాలెంజ్ ని నేను అంగీకరిస్తున్నారు. నేనేదైనా తప్పు చేసుంటే, రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసినట్టు రుజువైతే, రెండు చేతులతో చెవులను పట్టుకుని, మోకాళ్లపై వంగుతూ గుంజీలు తీస్తే చాలు” అని వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఆమె తప్పుబట్టారు. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ తరుఫున ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి అత్యంత దయనీయంగా ఉందని, చట్టవిరుద్ధంగా పని చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. శాసన సభ ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై టీఎంసీ, బీజేపీ చేస్తున్న ఫిర్యాదులపై ఈసీ తీసుకుంటున్న చర్యల్లో పక్షపాతం కనిపిస్తోందని ఆరోపించింది. ఈసీ పూర్తిగా విఫలమైందని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ఈసీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించవలసి ఉంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఈసీ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.

Tmc Alleges In Letter To Poll Panel

ఈసీ చట్ట విరుద్ధ చర్యలపై పశ్చిమ బెంగాల్ ప్రజలు దీటుగా స్పందిస్తారని, తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తారనే నమ్మకం ఉందని టీఎంసీ పేర్కొంది. ఈసీ తన చర్యల్లో కాస్త సమన్యాయం ఉండేలా చూసుకోవాలని లేఖలో కోరింది. ప్రస్తుతం ఈసీ చర్యల్లో న్యాయం కనిపించడం లేదని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

Tmc Alleges In Letter To Poll Panel 1

బిజేపీ ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసి, మమతా బెనర్జీని ప్రచారం చేయకుండా అడ్డుకున్నప్పటికీ , టీఎంసీ మోడ్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు ఉన్నప్పటికీ బీజేపీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీఎంసీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలను ఉటంకిస్తూ, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. మిగిలిన దశల్లో ప్రచారం చేసినందుకు మోదీ, అమిత్ షాలను నిషేధించాలని టీఎంసీ లేఖలో కోరింది.

Read Also…  సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష.. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తాంః కేసీఆర్