Avijit Ghosal: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఫిరాయింపుల ప్రభావం ఎంత? ఐదో విడతలో ఏ పార్టీ ఎలా ?

Avijit Ghosal: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఫిరాయింపుల ప్రభావం ఎంత? ఐదో విడతలో ఏ పార్టీ ఎలా ?
ప్రతీకాత్మక చిత్రం

ఏ విధంగా చూసినా.. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఈసారి ప్రత్యేకమనే చెప్పాలి. ఈ ఎన్నికల గురించి లెక్కలు వేయాలంటే.. కచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికల లెక్కలు చెప్పాల్సిందే. ఆ ఎన్నికల లెక్కలతోనే.. ప్రస్తుత ఎన్నికల విశ్లేషణ చేయగలిగే పరిస్థితి ఉంది.

KVD Varma

|

Apr 16, 2021 | 5:35 PM

Avijit Ghosal: ఏ విధంగా చూసినా.. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఈసారి ప్రత్యేకమనే చెప్పాలి. ఈ ఎన్నికల గురించి లెక్కలు వేయాలంటే.. కచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికల లెక్కలు చెప్పాల్సిందే. ఆ ఎన్నికల లెక్కలతోనే.. ప్రస్తుత ఎన్నికల విశ్లేషణ చేయగలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే, తొమ్మిదేళ్ళ తృణమూల్ కాంగ్రెస్ అప్రతిహత పాలనలో ఉన్న బెంగాల్ లో ఎక్కడో మూలన ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా దూసుకు వచ్చింది. బెంగాల్ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి 2019 ఎన్నికలు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 294 సీట్లకు గాను 211 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు బీజేపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమె తన ప్రభావాన్ని చూపించగలిగింది. కానీ, సరిగ్గా మూడేళ్ళు తిరిగేసరికి అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల సమయానికి బీజేపీ 121 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించడం ద్వారా అక్కడి అధికార తృణమూల్ కు గట్టి సవాల్ విసిరింది. ఆ ఎన్నికల్లో 164 స్థానాల్లో మాత్రమే టీఎంసీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు బీజేపీ అక్కడ ఎంతగా బలపడిందో. ఆ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 40.5 శాతం ఓట్లు సాధించి 18 స్థానాలను గెలుచుకుంది. అదే టీఎంసీ 43.6 శాతం ఓట్లతో 4 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విచిత్రంగా 1977-2011ల మధ్య 34 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వామపక్షాలు కనేసం ఒక్క సీటులోనూ ఆధిక్యాన్ని సాధించలేకపోయారు. కేవలం 6.4% ఓట్లను సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దయానీయంగా మారిపోయింది. ఆ పార్టీ 5.7% ఓట్లు మాత్రమే సాధించగలిగింది.

ఇక ఇక్కడ పార్టీలు మారిన వారు ఎక్కువగా ప్రభావితంగా నిలుస్తారని చెప్పుకునే జిల్లాలు తూర్పు మిడ్నాపూర్, సాంప్రదాయకంగా మాతాంగిని హజ్రా, ఖుదిరామ్ బోస్, సుశీల్ ధారా జిల్లాలు. వీటిలో తూర్పు మిడ్నాపూర్ జిల్లాను తీసుకుంటే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉండగా, బీజేపీ కేవలం 2 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. అయితే, ఇక్కడ టీఎంసీలో మమతా బెనర్జీ తరువాతి స్థానంలో ఉండే నాయకుడిగా చెప్పుకునే సువెందు అధికారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నారు. ఈ జిల్లాలో ఆయన కుటుంబం హవా చాలా ఎక్కువ. సువెందు అధికారి తండ్రి సిషీర్ ఇప్పటికీ టిఎంపీ ఎంపి (అదే జిల్లాలోని కాంతి నుండి) అదేవిధంగా అతని తమ్ముడు దిబియేందు కూడా అదే జిల్లాలోని మరొక సీటు (తమ్లుక్) నుండి టిఎంసి ఎంపిగా ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్న అసెంబ్లీ స్థానం బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ సీటు. ఇక్కడ మమతా బెనర్జీ పై సువెందు అధికారి పోటీ చేస్తున్నారు. ఇక అదేజిల్లా నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చెస్తూన్న మరో ఫిరాయింపు దారు మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నుంచి వచ్చిన తపసి మొండాల్. ఆమె హల్దియా నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) టికెట్‌పై 2016 లో ఎన్నికల్లో గెలిచారు. అదేవిధంగా టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ జాబితాలో ఫిరాయింపుదార్లు ఎక్కువగా ఉన్న మరో జిల్లా హౌరా. ఇది కోల్‌కతా నుండి హూగ్లీ నది ద్వారా వేరు చేయబడిన జిల్లా. ఈ జిల్లాలో, అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాల్లో టిఎంసి ముందంజలో ఉండగా, 2019 లో ఒక్క స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆ ఎన్నికల్లో టిఎంసి 50.7% ఓట్లు సాధించగా, బీజేపీ 37.6% ఓట్లు సాధించింది. ప్రస్తుతం ఇక్కడ హౌరాలో, టిఎంసి నాయకుడు, మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ టిఎంసి నుండి బిజెపికి మారారు, ఇది ఎన్నికల లెక్కల్ని గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాంజిబ్ బెనర్జీ డోమ్జూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.

హౌరాలో ఓటర్లు బీజేపీ వైపు మళ్ళించే చాన్స్ ఉన్న ఇతర ముఖ్యమైన అభ్యర్థులు కాంగ్రెస్ నుండి బిజెపికి మారిన అనుపమ్ ఘోష్, జగత్బల్లావ్పూర్ సీటు నుండి పోటీ చేస్తున్నారు. టిఎంసి నుండి బిజెపికి మారిన రతీంద్రనాథ్ చక్రవర్తి హౌరా దక్షిణాది సీటు నుండి పోటీ చేస్తున్నారు అదేవిధంగా బల్లి నుండి పోటీ చేస్తున్న వైశాలి దాల్మియా. డాల్మియా టిఎంసి నుండి బిజెపికి మారారు. వీరి ప్రభావం ఉంటుంది అనటానికి పెద్దగా ఆధారాలు అవసరం లేదు. బెంగాల్ లో ఈ రకమైన మార్పులు ఇటీవల లేకపోయినా, 2016 ఎన్నికల్లో అస్సాంలో ఆ ఎన్నికలకు ముందు హిమంత బిస్వాసర్మ కాంగ్రెస్ నుంచి వైదొలిగి బిజెపిలో చేరారు. ఆయన అక్కడ ఘన విజయం సాధించారు. అలాగే ఒడిశాలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బైజయంత్ జై పాండా బిజెడి నుంచి బిజెపిలో చేరారు, కాని ఆయన కేంద్రపారా నుండి తన సాంప్రదాయ ఎంపి నియోజకవర్గాన్ని కూడా కోల్పోయారు. ఇక మహారాష్ట్రలోనూ ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో సంబంధం ఉన్న మాజీ సతారా ఎంపి ఉదయన్‌రాజ్ భోస్లే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిజెపిలో చేరారు. కానీ బిజెపి టికెట్‌తో సతార లోక్‌సభ ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ మహారాష్ట్రలో కూడా ఆయన ముద్ర వేయలేకపోయారు.

అదేవిధంగా దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో కూడా టర్న్‌కోట్స్ బలీయమైన శక్తిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర 24 పరగణాల్లో 21 విభాగాల్లో టిఎంసి ముందంజలో ఉండగా, బిజెపి 12 లో ఆధిక్యంలో ఉంది. ఈ జిల్లాలో టిఎంసి 46.2% ఓట్లు సాధించగా, 39.5% ఓట్లు బిజెపికి పోలయ్యాయి.

అలాగే, దక్షిణ 24 పరగణాలు జిల్లాలో కూడా మొత్తం 31 అసెంబ్లీ విభాగాలలో మమతా బెనర్జీ పార్టీ విజయం సాధించి ఆధిక్యాన్ని కనబరిచింది. అదే ఊపును ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా కొనసాగించింది టిఎంసి. ఇంత ఆధిపత్యం ఉన్న దక్షిణ 24 పరగణాలు జిల్లాలో కూడా కొన్నిచోట్ల ఫిరాయింపుదార్లు   ఉన్నారు. ఈ జిల్లాల్లో 2029 ఎన్నికల్లో టిఎంసికి 52.6% ఓట్లు రాగా, బిజెపి 33.1% ఓట్లు సాధించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu