West Bengal, Assam Election Results 2021 Highlights: పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడోసారి టీఎంసీ హవా.. అస్సాం ఎన్డీయేదే..

| Edited By: Ram Naramaneni

May 02, 2021 | 10:52 PM

West Bengal, Assam Assembly Election Results 2021 LIVE Counting and Updates: బెంగాల్‌, అస్సాంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. బెంగాల్‌లో టీఎంసీ మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. 200లకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అస్సాంలో ఎన్డీఏ కూటమి మేజిక్ ఫిగర్ దాటేసింది..

West Bengal, Assam Election Results 2021 Highlights: పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడోసారి టీఎంసీ హవా.. అస్సాం ఎన్డీయేదే..
West Bengal, Assam Assembly Election Results 2021

West Bengal, Assam Assembly Election Results 2021 LIVE Counting and Highlights: దాదాపు రెండు నెలల ఉత్కంఠకు నేటితో తెరపడింది. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లల్లో ఏయే పార్టీలు అధికారం చేపట్టనున్నాయనేది దాదాపు  ఖరారు అయ్యాయి. ఎవరు పైచేయి సాధిస్తారు? గెలిచేదెవరు..? అనేది తేలిపోయింది.

ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది తొలి నుంచి ఉత్కంఠ నెలకొనగా.. ఆ ఉత్కంఠకు తెరపడింది. బెంగాల్‌లో అధికార పార్టీ తృణముల్‌ పార్టీదే మరోసారి హవా కొనసాగింది. వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించింది. అధికారం తమదే అంటూ గర్జించిన బీజేపీకి చెక్ పెట్టి టీఎంసీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 292 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ కేవలం 76 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక ఇతరులు మూడు స్థానాల్లో పాగా వేశారు. మొత్తం హోరాహోరీగా సాగిన ఈ పోరులో తుదకు బెంగాల్ టైగర్‌గా అభిమానులు పిలుచుకునే దీదీనే జయకేతనం ఎగురవేసింది.

ఇక్క అస్సాంలో అధికార ఎన్డీయే కూటమే మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అస్సాంలో 126 స్థానాలకు పోలింగ్ జరుగగా.. వీటిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 74 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక యూపీఏ 44 స్థానాల్లో పాగా వేయగా.. ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 294 సీట్లు..

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే కరోనా కారణంగా ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఇక్కడ ప్రధానంగా అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోటీ నెలకొంది.

అస్సాంలో 126 సీట్లు..

అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 May 2021 10:15 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌కు ఫోన్ చేసి సోనియా గాంధీ..

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఆధ్వర్వంలోని డీఎంకే విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వారిద్దరికీ ఫోన్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

  • 02 May 2021 10:11 PM (IST)

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్ ఫలితాలు యూపీ, సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయి: యశ్వంత్ సిన్హా

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయని తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా అన్నారు. కేంద్ర నాయకత్వంలో మార్పును దేశ ప్రజలు కోరుకుంటున్నారని సిన్హా అన్నారు.

  • 02 May 2021 10:10 PM (IST)

    West Bengal election result Live: బెంగాల్‌లో బీజేపీ శక్తివంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది: అమిత్ షా

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ శక్తివంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్ ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బలమైన ప్రతిపక్షంగా, బెంగాల్ ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రగతి కోసం బీజేపీ తన గొంతును బలంగా వినిపిస్తుందన్నారు.

  • 02 May 2021 09:42 PM (IST)

    West Bengal election result Live: ఎన్డీయేను ఆశీర్వదించినందుకు అస్సాం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

    West Bengal election result Live: ఎన్డీయేను ఆశీర్వదించినందుకు అస్సాం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘అస్సాం ప్రజలు మళ్లీ ఎన్డీయే అభివృద్ధి అజెండాకు పట్టం కట్టారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించారు. మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన అస్సాం ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు నా అభినందనలు’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.

  • 02 May 2021 09:23 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్..

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడవసారి ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. దీదీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • 02 May 2021 09:20 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి తనను కలవనున్నారని జగ్‌దీప్ ధన్‌ఖర్ వెల్లడించారు.

  • 02 May 2021 09:14 PM (IST)

    West Bengal election result Live: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓటమి కన్ఫామ్.. ప్రకటించిన ఈసీ.. 

    West Bengal election result Live: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇదే విషయంపై ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకనట చేసింది. మమతా బెనర్జీపై సుభేందు అధికారి గెలుపొందారని స్పష్టం చేసింది. అయితే, ఎన్ని ఓట్లతో ఓడిపోయారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

  • 02 May 2021 08:39 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత కైలాష్ విజయ వర్గీయ

    West Bengal election result Live: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కైలాష్ విజయ వర్గీయ శుభాకాంక్షలు తెలిపారు. ‘మమతా జీ.. ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు. ప్రజల నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని హామీ ఇస్తున్నాము. కానీ మీరు మీ పార్టీ శ్రేణులను క్రమశిక్షణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. వారిని అదుపులో పెట్టుకుంటే మంచిది’ అని కైలాష్ వర్గీయ అన్నారు.

  • 02 May 2021 08:03 PM (IST)

    Assam election result Live: ‘అస్సాంలో బీజేపీదే ప్రభుత్వం.. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి’

    Assam election result Live: అస్సాంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు.

  • 02 May 2021 07:59 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీకి అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ..

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

  • 02 May 2021 07:56 PM (IST)

    West Bengal election result Live: బీజేపీని ఆధరించిన పశ్చిమ బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ..

    West Bengal election result Live: ‘మా పార్టీని ఆశీర్వదించిన పశ్చిమ బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు. అతి తక్కువ స్థానాల నుంచి బీజేపీ గణనీయంగా పుంజుకుంది. ప్రజలకు బీజేపీ సేవ చేస్తూనే ఉంటుంది. ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ నేతను, ప్రతీ కార్యకర్తను అభినందిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు.

  • 02 May 2021 07:28 PM (IST)

    West Bengal election result Live: కాళీఘాట్ ఆలయానికి చేరుకున్న మమతా బెనర్జీ..

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీ ఘాట్‌ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

  • 02 May 2021 07:26 PM (IST)

    West Bengal election result Live: నందిగ్రామ్ ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తా.. ప్రకటించిన మమతా బెనర్జీ..

    West Bengal election result Live: నందిగ్రామ్ ఫలితాలపై మమతా బెనర్జీ స్పందించారు. ఫలితాలను అంగీకరిస్తానంటూనే.. కుట్ర జరిగిందని ఆరోపించారు. ఫలితాల ప్రకటనలో బీజేపీ కుట్ర చేసిందని, ఆ కుట్రను బహిర్గతం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. ఈ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు.

  • 02 May 2021 07:20 PM (IST)

    Assam election result Live: అస్సాం సీఎం ఎన్నికపై కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కామెంట్స్..

    Assam election result Live: అస్సాంలో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. శాసనసభ నాయకుడిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్య విధానాల ద్వారా జరుగుతోందన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తరువాత, తమ పార్టీ అధినాయకత్వం సరైన నాయకున్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటుంది అని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

  • 02 May 2021 06:55 PM (IST)

    Nandigram Election Result 2021: నందిగ్రామ్‌లో అనూహ్య మలుపు.. మమతా బెనర్జీపై సుభేందు అధికారి గెలుపు..?

    Nandigram Election Result 2021: పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సుభేందు అధికారి 1,622 ఓట్ల తేడాతో గెలుపొందారంటూ జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మమతా బెనర్జీ కూడా అందుకు అనుకూలంగా ప్రకటన చేశారు. అయితే, నందిగ్రామ్ ఫలితంపై ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల అవలేదు. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

     

    మరోవైపు ఈ అంశంపై స్పందించిన మమతా బెనర్జీ… నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ప్రకటించారు. వాస్తవానికి నందిగ్రామ్‌లో 221 ఓట్ల తేడాతో గెలిచామని, బీజేపీ కుట్ర చేసి ఫలితాన్ని మార్చేసిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీ అధికారి ప్రతినిధిలా వ్యవహరించిందని ఆరోపించారు. నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికీ.. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రిగా తానే ప్రమాణ స్వీకారం చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటిస్తానని వెల్లడించారు. నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికీ.. 221 స్థానాలల్లో టీఎంసీ గెలిచిందన్నారు. ఈ విజయం బెంగాల్ ప్రజల విజయం అని పేర్కొన్నారు.

  • 02 May 2021 06:09 PM (IST)

    Assam election result Live: అస్సాంలో ఎన్డీయేదే అధికారం.. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్పందన ఇదీ..

    Assam election result Live: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కానుంది. 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 72 చోట్ల లీడ్‌లో ఉండగా.. యూపీఏ 45, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ విజయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ స్పందించారు. అస్సాంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, దీనికి ప్రజలకు తమపై ఉన్న నమ్మకమే కారణమని చెప్పుకొచ్చారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అందించిన ప్రజలకు సర్బానంద సోనోవాల్ కృజత్ఞలు తెలిపారు.

  • 02 May 2021 05:46 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

    West Bengal election result Live: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి పదవీకాలం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు.

  • 02 May 2021 05:34 PM (IST)

    Assam election result Live: వరుసగా ఐదవసారి గెలిచిన బీజేపీ నేత.. ఈ సారి లక్ష పైచిలుకు మెజార్టీ ఓట్లతో..

    Assam election result Live: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత రికార్డ్ విజయం సాధించారు. జలుక్బరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి హిమంత బిశ్వ శర్మ.. వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించారు. ఈసారి ఏకంగా 1,01,911 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం ప్రజలకు హిమంత బిశ్వ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  • 02 May 2021 05:26 PM (IST)

    West Bengal election result Live: ఈ విజయం బెంగాల్ ప్రజల విజయం.. వీల్ చైర్ దిగి కృతజ్ఞతలు తెలిపిన మమతా బెనర్జీ..

    West Bengal election result Live: నందిగ్రామ్‌లో బీజేపీ నేత సుభేందు అధికారిపై గెలుపొందిన నేపథ్యంలో మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వీల్‌చైర్ నుంచి దిగి ఆనందంతో నడుచుకుంటూ మీడియా ముందుకు వచ్చారు మమతా బెనర్జీ. ఎన్నికల్లో ఘన విజయం సాధించామని అన్నారు. ఇది బెంగాల్ ప్రజల విజయం అని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలకు ఈ సందర్భంగా మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించామని, ఇక కరోనాపై విజయం సాధించడమే లక్ష్యం అని దీదీ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

  • 02 May 2021 04:35 PM (IST)

    West Bengal election result Live: నందిగ్రామ్‌లో సుభేందుకు సురుకు పెట్టిన ప్రజలు.. 1200 ఓట్ల మెజార్టీతో దీదీ గెలుపు

    West Bengal election result Live: నందిగ్రామ్‌లో నువ్వా.. నేనా అంటూ సాగిన ఉత్కంఠ పోరులో బీజేపీ నేత సుబేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. 17 రౌండ్ ముగిసే సరికి 1200 ఆధిక్యంలో విజయ బావుటా ఎగురవేశారు.

  • 02 May 2021 04:26 PM (IST)

    Assam election result Live: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ స్పందన..

    Assam election result Live: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సీఎం సోనోవాల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే అస్సాం ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. అస్సాంలో బీజేపీ సాధించిన విజయానికి ప్రధాని మోదీ, సీఎం సోనోవాల్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కార్యకర్తలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.

  • 02 May 2021 04:21 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్

    West Bengal election result Live: పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడవ సారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గొప్ప విజయం నేపథ్యంలో దీదీకి, పశ్చిమ బెంగాల్ ప్రజలకు హృదపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హేమంత్ సోరేన్ ట్వీట్ చేశారు.

  • 02 May 2021 04:15 PM (IST)

    West Bengal election result Live: సుభేందు అధికారిపై 820 ఓట్ల ఆధిక్యంలో మమతా బెనర్జీ..

    West Bengal election result Live: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు ఛేంజ్ అవుతున్నాయి. ప్రస్తుతం 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం సుభేందు అధికారిపై మమతా బెనర్జీ 820 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 03:56 PM (IST)

    Assam election result Live: అస్సాంలో దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి.. స్వీట్లు పంచుకుంటున్న బీజేపీ శ్రేణులు..

    Assam election result Live: అస్సాంలో మరోసారి అధికారం దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. దాంతో బీజేపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికే పలు స్థానాల్లో గెలుపొందగా.. ప్రస్తుతం 57 స్థానాల్లో ముందంజలో ఉంది. దాంతో బీజేపే శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.

  • 02 May 2021 03:50 PM (IST)

    West Bengal election result Live: మమతా బెనర్జీపై మళ్లీ పైచేయి సాధించిన సుభేందు అధికారి..

    West Bengal election result Live: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. టీఎంపీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సుభేందు అధికారి మధ్య నువ్వా, నేనా అనేలా పోటీ తలపిస్తోంది. రౌండ్ రౌండ్‌కి పరిస్థితి మారిపోతోంది. 15వ రౌండ్‌ ముగిసే సమయానికి మమతా బెనర్జీ 3వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉండగా.. 16వ రౌండ్‌కు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. మమతా బెనర్జీపై సుభేందు అధికారి 6 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

  • 02 May 2021 03:40 PM (IST)

    Assam election result 2021 Live: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే విజయం..!

    Assam election result 2021 Live: ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం అస్సాంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. ఎన్డీయే కూటమి 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. యూపీఏ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 03:26 PM (IST)

    మమతా బెనర్జీ vs సువేందు అధికారి.. 3800 ఓట్ల ఆధిక్యంలో దీదీ..

    నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రత్యర్థి సుభేందు అధికారిపై ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి సుభేందు అధికారిపై మమతా బెనర్జీ 3,800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 03:20 PM (IST)

    ఓట్ల లెక్కింపులో ఆలస్యమేం లేదు.. స్పష్టం చేసిన భారత ఎన్నికల సంఘం..

    ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిధానంగా సాగుతుందంటూ వస్తున్న ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సక్రమంగానే సాగుతుందని స్పష్టం చేసింది. అయితే, అధిక లోడ్ కారణంగా సర్వర్ డౌన్ కొద్దిగా డౌన్ అయిందని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగానే సాగుతోందని తేల్చి చెప్పింది.

  • 02 May 2021 03:15 PM (IST)

    కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..

    కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 200లకు పైగా స్థానాల్లో మెజార్టీలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే, టీఎంసీ శ్రేణులు పెద్ద ఎత్తున కోల్‌కతాలోని హేస్టింగ్స్ ప్రాంతంలో గల బీజేపీ కార్యాలయం వెలుపల గుమికూడారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.

  • 02 May 2021 03:08 PM (IST)

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో సంబరాలకు దూరంగా ఉండండి.. టీఎంసీ స్టేట్ యూత్ సెక్రటరీ సయన్ దేవ్ ఛటర్జీ

    కరోనా విజృంభజన వేళ టీఎంసీ శ్రేణులు సంబరాలు చేసుకోవడంపై ఆ పార్టీ యూత్ రాష్ట్ర సెక్రటరీ సయన్ దేవ్ ఛటర్జీ స్పందించారు. ‘మేం సంబరాలు చేసుకోవాలని లేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న మా పార్టీ శ్రేణులకు ఈ విజయం గొప్ప శక్తిని ఇచ్చింది. అయినప్పటికీ మేము చెబుతూనే ఉన్నాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సంబరాలు చేసుకోవచ్చదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం.’ అని సయ్ దేవ్ ఛటర్జీ స్పష్టం చేశారు.

  • 02 May 2021 02:52 PM (IST)

    Tejashwi Yadav: మమతాకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శుభాకాంక్షలు..

    పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 205 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.. మమతా బెనర్జీకి శుభాకాంక్షలకు తెలియజేశారు.

  • 02 May 2021 02:43 PM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో మళ్లీ ఆధిక్యంలో సీఎం మమతా బెనర్జీ..

    నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సువేందు అధికారిపై.. మమతా బెనర్జీ ప్రస్తుతం 2331 ఓట్ల ఆధిక్యంలో ముందున్నారు. ఇప్పుడు 14 రౌండ్ల ఓటింగ్ పూర్తయింది. సువేందు రెండో స్థానంలో ఉన్నారు.

  • 02 May 2021 02:39 PM (IST)

    West Bengal election result Live: నందిగ్రాంలో టీఎంసీ మద్దతుదారుల వేడుకలు..

    పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 200లకు పైగా సీట్లల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మేరకు నందిగ్రాంలో టీఎంసీ మద్దతుదారులు వేడుకలు జరుపుకుంటున్నారు.

  • 02 May 2021 02:36 PM (IST)

    ఉలువేరియా నార్త్‌లో టీఎంసీ అభ్యర్థి ఘన విజయం..

    పశ్చిమ బెంగాల్ ఉలువేరియా నార్త్‌ అసెంబ్లీ సీటులో.. టీఎంసీ అభ్యర్థి విదేశీ బోస్‌ విజయం సాధించారు. ఈ విజయంతో టీఎంసీ రెండు సీట్లల్లో విజయం సాధించింది.

  • 02 May 2021 02:24 PM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన సువేందు అధికారి..

    నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. మమతా బెనర్జీ దాదాపు 4000 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారికి 34430 ఓట్లు రాగా.. మమతా బెనర్జీకి 30655 ఓట్లు వచ్చాయి.

  • 02 May 2021 02:20 PM (IST)

    sanjay raut: బెంగాల్ టైగర్‌కు శుభాకాంక్షలు.. శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్..

    బెంగాల్‌లో టీఎంసీ 205 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ మమతా బెనర్జీకి శుభాకాంక్షలకు తెలియజేశారు. బెంగాల్ టైగర్‌కు శుభాకాంక్షలంటూ ట్విట్ చేశారు.

  • 02 May 2021 02:15 PM (IST)

    Manoj Tiwari:టీఎంసీ అభ్యర్థి, క్రికెటర్ మనోజ్ తివారీ విజయం..

    బెంగాల్‌లో టీఎంసీ నుంచి పోటీచేసిన క్రికెటర్ మనోజ్ తివారీ గెలుపొందారు. ఆయన షిబ్‌పూర్ సీటులో టీఎంసీ తరుపున పోటీ చేశారు.

  • 02 May 2021 02:09 PM (IST)

    Assam election result Live: అస్సాంలో ఎన్‌డీఏ కూటమి ఆధిక్యం..

    అస్సాంలో బీజేపీ ఎన్డీఏ కూటమి 77 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. యూపీఏ కూటమి 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 02:04 PM (IST)

    Arvind Kejriwal: మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

    పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేశారు.

  • 02 May 2021 02:01 PM (IST)

    West Bengal election result Live: బెంగాల్‌లో దూసుకుపోతున్న టీఎంసీ .. 205 స్థానాల్లో ఆధిక్యం..

    బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 205, బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. యూనెటెడ్ ఫ్రంట్ 1 స్థానంలో, ఇతరులు రెండుస్థానాల్లో ముదంజలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 01:53 PM (IST)

    Sharad pawar on election results: మమతా బెనర్జీ, స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన శరద్ పవార్..

    ఎన్నికల ఫలితాలపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మమతాబెనర్జీ, స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 02 May 2021 01:49 PM (IST)

    Election Results 2021 LIVE: వేడుకలు నిర్వహిస్తే.. ఎస్‌హెచ్ఓలు సస్పెండ్.. ఈసీ ఆదేశాలు..

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఆయా పార్టీల మద్దతుదారులు వేడుకలు నిర్వహిస్తున్నారు. కరోనా దృష్ట్యా ఈసీ ఇప్పటికే వేడుకలను నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా.. వేడుకలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎక్కడైనా వేడుకలు నిర్వహిస్తే.. ఆయా ప్రాంతాల్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ.. ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.

  • 02 May 2021 01:43 PM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో దూసుకుపోతున్న మమతా బెనర్జీ..

    నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. సువేందు అధికారిపై ఆమె 2,700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 01:37 PM (IST)

    Akhil Gogoi: అస్సాంలో అఖిల్ గోగోయ్ ముందంజ.. ఆధిక్యంలో ఎన్డీఏ

    అస్సాంలోని సిబ్‌సాగర్ అసెంబ్లీ స్థానంలో అఖిల్ గొగోయ్ మూడున్నర వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిబ్‌సాగర్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుర్భి రాజ్‌కోవరీ రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ 80 సీట్లల్లో, యూపీఏ 45 సీట్లల్లో ముందంజలో ఉన్నాయి.

  • 02 May 2021 01:14 PM (IST)

    West Bengal election result Live: 206 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం..

    West Bengal: బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 206, బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • 02 May 2021 01:08 PM (IST)

    ECI: వేడుకలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి: ఈసీ ఆదేశాలు..

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ మధ్య పలు పార్టీల నాయకులు వేడుకలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వేడుకలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించినట్లు వెల్లడించింది.

  • 02 May 2021 01:02 PM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఆధిక్యం..

    నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఐదు రౌండ్ల వరకూ సువేందు అధికారి ముందంజలోనే కొనసాగారు. ఆ తర్వాత మమతా 1417 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.

  • 02 May 2021 12:47 PM (IST)

    బెంగాల్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ పార్టీ..

    బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ 202 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 77 సీట్లల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్ కూటమి ఒక సీటులో ఆధిక్యంలో ఉంది. దీంతో పలుచోట్ల టీఎంసీ కార్యకర్తలు సంబంరాలు జరుపుకుంటున్నారు.

  • 02 May 2021 12:44 PM (IST)

    West Bengal election result Live: బెంగాల్‌లో 200 సీట్లల్లో టీఎంసీ లీడ్.. కార్యకర్తల విజయోత్సాహం..

    బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ 200 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 91 సీట్లల్లో లీడ్‌లో ఉంది. లెఫ్ట్ కూటమి ఒక సీటులో ఆధిక్యంలో ఉంది. దీంతో పలుచోట్ల టీఎంసీ కార్యకర్తలు సంబంరాలు జరుపుకుంటున్నారు.

  • 02 May 2021 12:26 PM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో సువేందు అధికారికి 3వేల ఆధిక్యం..

    నందిగ్రామ్‌లో సువేందు అధికారి ముందంజలోనే కొనసాగుతున్నారు. ఐదవ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే వరకు నందిగ్రామ్‌లో బీజేపీ నుంచి పోటీచేసిన సువేందు అధికారి 3686 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ బీజేపీకి 34428 ఓట్లు రాగా.. టీఎంసీకి 30742, సీసీఎంకు 1890 ఓట్లు వచ్చాయి.

  • 02 May 2021 12:21 PM (IST)

    Manoj Tiwari: బెంగాల్‌లో 13వేల ఆధిక్యంలో క్రికెటర్ మనోజ్ తివారీ..

    షిబ్‌పూర్ నుంచి క్రికెటర్ మనోజ్ తివారీ బెంగాల్‌లో 13వేల లీడ్‌తో ముందంజలో కొనసాగుతున్నారు. ఆయన షిబ్‌పూర్ సీటు నుంచి టీఎంసీ తరుపున పోటీ చేశారు.

  • 02 May 2021 12:20 PM (IST)

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో

    నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో TRS అభ్యర్థి దూసుకుపోతున్నాడు. 11వ రౌండ్‌ కౌంటింగ్‌లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జానా రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ వెయ్యి ఓట్లకుపైగా ఆధిక్యం ఉన్నాడు. ఈ రౌండ్‌లో TRSకు 3,395 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ 2,325 ఓట్లు వచ్చాయి.

     

  • 02 May 2021 12:03 PM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో వెనుకంజలోనే దీదీ.. దూసుకుపోతున్న సువేందు అధికారి..

    బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో సువేందు అధికారి పూర్తి స్థాయి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సీఎం మమతా బెనర్జీ 7వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. టీఎంసీ అధినేత్రికి నాలుగో రౌండ్‌లో కూడా ఓట్లు భారీగా తగ్గాయి.

  • 02 May 2021 11:53 AM (IST)

    West Bengal election result Live: బెంగాల్‌లో దీదీ పార్టీ ఆధిక్యం..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. టీఎంసీ 189, బీజేపీ 99, యునైటెడ్ ఫ్రంట్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం అధికారిక ట్రెండ్స్ ప్రకారం 185 స్థానాల్లో టీఎంసీ ముందంజలో ఉంది.

  • 02 May 2021 11:37 AM (IST)

    Assam CM Sarbananda Sonowal: అస్సాంలో బీజేపీదే ప్రభుత్వం.. సీఎం సర్బానంద సోనోవాల్

    అస్సాంలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం తమదే విజయమని పేర్కొన్నారు.

  • 02 May 2021 11:20 AM (IST)

    West Bengal election result Live: 172 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం..

    బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. 253 స్థానాల్లో.. టీఎంసీ 166, బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • 02 May 2021 11:12 AM (IST)

    Kailash Vijayvargiya: చాలా రౌండ్లు ఉన్నాయ్.. మేజిక్ ఫిగర్ దాటుదాం.. బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. చాలా స్థానాల్లో టీఎంసీ దూసుకుపోతోంది. ఈ క్రమంలో.. బెంగాల్ బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా మీడియాతో మాట్లాడారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయని.. సాయంత్రం వరకు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మాకు 100 సీట్లు కూడా లభించవని సవాలు చేశారు. మేము ఆ మార్కును దాటాము.. మేజిక్ ఫిగర్‌ను కూడా దాటుతాం అంటూ కైలాష్ విజయవర్గియా పేర్కొన్నారు.

  • 02 May 2021 11:06 AM (IST)

    Assam election result Live: అస్సాంలో 59 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

    తాజా ట్రెండ్స్ ప్రకారం.. అస్సాంలో బీజేపీ కూటమి 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. యూపీఏ కూటమి 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 10:48 AM (IST)

    West Bengal election result Live: 112 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం..

    బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. 172 స్థానాల్లో.. టీఎంసీ 112, బీజేపీ 58, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 10:36 AM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో దూసుకుపోతున్న సుభేందు అధికారి..

    బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో సుభేందు అధికారి పూర్తి స్థాయి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సీఎం మమతా బెనర్జీ 7వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. టీఎంసీ అధినేత్రికి మూడో రౌండ్‌లో కూడా ఓట్లు భారీగా తగ్గాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 149, బీజేపీ 118, యునైటెడ్ ఫ్రంట్ 5, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 10:22 AM (IST)

    Assam election result Live: అస్సాంలో ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ..

    ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాంలో బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాని మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ 6 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 5 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 10:19 AM (IST)

    West Bengal election result Live: బెంగాల్.. దంగల్.. టీఎంసీ 68 సీట్లల్లో .. బీజేపీ 36 సీట్లల్లో ముందంజ..

    West Bengal election result Live:ఎన్నికల సంఘం తాజా పోకడల ప్రకారం.. బెంగాల్‌లో టీఎంసీ 68 సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 36 సీట్లల్లో ముందంజలో ఉన్నాయి.

  • 02 May 2021 09:58 AM (IST)

    Manoj Tiwari: బెంగాల్‌లో క్రికెటర్ మనోజ్ తివారీ ముందంజ..

    క్రికెటర్ మనోజ్ తివారీ బెంగాల్‌లో ముందంజలో కొనసాగుతున్నారు. ఆయన షిబ్‌పూర్ సీటు నుంచి టీఎంసీ తరుపున పోటీ చేశారు.

  • 02 May 2021 09:50 AM (IST)

    Assam election result Live: అస్సాంలో ఆరు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

    ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాలో 6 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దాని మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 09:44 AM (IST)

    Assam election result Live: అస్సాంలో ఎన్‌డిఏ కూటమి ముందంజ

    తాజా పోకడల ప్రకారం.. అస్సాంలో ఎన్డీఏ 29, యూపీఏ 14 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. సీఎం సర్బానంద సోనోవాల్.. ముందంజలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 09:40 AM (IST)

    West Bengal election result Live: 7 సీట్లల్లో టీఎంసీ.. 3 సీట్లల్లో బీజేపీ ముందంజ..

    West Bengal election result Live:ఎన్నికల సంఘం తాజా పోకడల ప్రకారం.. బెంగాల్‌లో టీఎంసీ 7 సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 3 సీట్లల్లో ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 09:35 AM (IST)

    Mamta banerjee vs Suvendu adhikari: నందిగ్రామ్‌లో సుభేందు అధికారి ముందంజ.. మమతా వెనుకంజ..

    బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో ప్రస్తుతం సుభేందు అధికారి 1497 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో.. ప్రస్తుతం.. టీఎంసీ 110, బీజేపీ 101, యునైటెడ్ ఫ్రంట్ 6, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 09:29 AM (IST)

    Assam election result: అస్సాంలో ఒక సీటులో కాంగ్రెస్ ముందంజ..

    అస్సాంలో.. కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్‌లో ఉంది. ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా సమాచారమిచ్చింది.

  • 02 May 2021 09:27 AM (IST)

    West Bengal election result Live: రెండు సీట్లల్లో టీఎంసీ, ఒక సీటులో బీజేపీ ముందంజ

    West Bengal election result Live: ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం.. బెంగాల్‌లో టిఎంసి రెండు సీట్లల్లో, బీజేపీ ఒక సీటులో ముందంజలో ఉంది.

  • 02 May 2021 09:14 AM (IST)

    Assam election result: వెనుకంజలో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్..

    అస్సాంలో… పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో వెనుకబడి ఉన్నారు. మజోలి సీటు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ 17, యుపిఎ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

  • 02 May 2021 09:06 AM (IST)

    కౌంటింగ్ కేంద్రంలో స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఏజెంట్

    బెంగాల్‌లోని ఉత్తర పరగణ జిల్లాలోని పానిహతి కౌంటింగ్ కేంద్రంలో.. కాంగ్రెస్ అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్ తపస్ మజుందార్ అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

  • 02 May 2021 08:58 AM (IST)

    West Bengal election result: బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ మధ్య హోరాహోరీ..

    బెంగాల్‌లో బ్యాలెట్ పేపర్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ధోరణి ప్రకారం.. 116 సీట్లల్లో టీఎంసి 60, బీజేపీ 55 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అలాగే కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 1 స్థానంలో ముందంజలో ఉంది.

  • 02 May 2021 08:49 AM (IST)

    pachim bangal election result: ముందంజలో.. టీఎంసీ అధినేత్రి మమతా.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో 

    బెంగాల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముందుంజలో ఉన్నారు. టాలిగంజ్ సీటులో బీజేపీ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ముందంజలో ఉన్నారు. బెహాలా వెస్ట్‌లో మంత్రి టీఎంసీ అభ్యర్థి పార్థా ఛటర్జీ వెనుకంజలో ఉన్నారు.
  • 02 May 2021 08:32 AM (IST)

    West Bengal election result: బెంగాల్‌లో 33 సీట్లల్లో టీఎంసీ ముందంజ

    బెంగాల్‌లో బ్యాలెట్ పేపర్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ధోరణి ప్రకారం.. 58 సీట్లల్లో టీఎంసి 33, బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. అలీపుర్దువార్, దిన్హాటా, కుమారగ్రామ్, కలచిని, మదరిహాట్‌లో బీజేపీ ముందంజలో ఉంది.

  • 02 May 2021 08:29 AM (IST)

    Assam election result: అస్సాంలో 4 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యం

    అస్సాంలో.. ఎన్డీఏ 4, యుపిఎ 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఎనిమిది మంది షెడ్యూల్డ్ కులాలకు, 16 మంది షెడ్యూల్డ్ తెగలకు సీట్లు రిజర్వ్ చేశారు.

  • 02 May 2021 08:23 AM (IST)

    బెంగాల్‌లో 15 స్థానాల్లో టీఎంసీ ముందంజ

    పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో బెంగాల్‌లో 15 సీట్లలో టీఎంసీ ముందంజలో ఉంది. 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 08:13 AM (IST)

    Election results 2021: కరోనా నిబంధనలతో..

    కరోనా వ్యాప్తినేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి శానిటైజేషన్ ఏర్పాట్లు చేశారు. మాస్కులు, శానిటైజేషన్, లెక్కింపు కేంద్రంలో పరిశుభ్రతపై అధికారులు దృష్టిసారించారు. ఈ చిత్రం బెంగాల్ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించింది.

  • 02 May 2021 08:04 AM (IST)

    West Bengal, Assam election result: ప్రారంభమైన కౌంటింగ్.. సర్వత్రా ఉత్కంఠ..

    election result: పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

  • 02 May 2021 08:01 AM (IST)

    election result: కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆసక్తికర ట్విట్..

    Kapil Sibal: ఎన్నికల ఫలితాల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఆసక్తికర ట్విట్ చేశారు. “ఈ రోజు, ఎన్నికల ఫలితాలు.. ఇంత ఓటమి తరువాత వచ్చే విజయం వల్ల ప్రయోజనం లేదు.. ఈ రోజు విషయం ఏమిటంటే..? ప్రజల ప్రాణాలను కాపాడటం.. అంటూ ట్విట్ చేశారు.

  • 02 May 2021 07:52 AM (IST)

    West Bengal election result: కౌంటింగ్‌కు ముందే ఆరోపణలు..

    బెంగాల్‌లో ఓట్ల లెక్కింపునకు ముందు.. ఆరోపణల ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చి చూడగానే.. స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఉందని టీఎంసీ అభ్యర్థి సోవోందేవ్ చటోపాధ్యాయ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్‌ ప్రారంభం కాకముందే.. స్ట్రాంగ్ రూం తెరవడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు.

  • 02 May 2021 07:43 AM (IST)

    అస్సాంలో..

    మరి కొన్ని నిమిషాల్లో అస్సాంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 126 స్థానాలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దిబ్రుగఢ్‌లో ప్రస్తుత విజువల్స్..

  • 02 May 2021 07:32 AM (IST)

    భారీ భద్రతతో ఏర్పాట్లు.. ఉత్కంఠ రేపుతున్న బెంగాల్ ఫలితాలు..

    మరి కాసేపట్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు పార్టీలకు చెందిన ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. సిలిగురి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత పరిస్థితిని వీక్షించవచ్చు.

Follow us on