పంజాబ్​ మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఓటమి పాలయ్యారు. పాటియాలా నుంచి బరిలోకి దిగిన ఆయన గెలుపొందలేకపోయారు. అమరీందర్​ సింగ్​పై ఆప్​ అభ్యర్థి అజిత్​పాల్ కోహ్లీ గెలుపొందారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారిన దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​ ఓటమిపాలయ్యారు. పనాజీ స్థానంలో ఉత్పల్​పై బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్సెరెట్​ విజయం సాధించారు.
ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దని, చివరి వరకు ఎదురుచూడాలని కార్యకర్తలను కోరింది సమాజ్​వాదీ పార్టీ. ముందస్తు అంచనాలు.. కచ్చితమైనవి కాదని, కార్యకర్తలు కార్యాలయాల్లోనే ఉండాలని పేర్కొంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే.. అసలైన ఫలితాలు తెలుస్తాయని, అప్పటివరకు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని ట్వీట్​ చేసింది.
ఎన్నికల ఫలితాల అనంతరం.. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. అంతకుముందు కరోనా నేపథ్యంలో వీటిపై నిషేధం అమల్లో ఉండగా.. తాజాగా సడలించింది.
పంజాబ్ ఎన్నికల తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కంగ్రాట్స్ చెప్పారు.
మార్పు మంచికే అన్న సామెత ఉత్తరాఖండ్‌ రిజల్ట్‌ను చూస్తే నిజమే అనిపిస్తోంది. వరుసబెట్టి సీఎంలను మార్చిన కాషాయ పార్టీనే మళ్లీ విజయం వరించింది. ఏకపక్ష గెలుపుతో ఉత్తరాఖండ్‌లో తిరుగులేని పార్టీగా అవతరించింది బీజేపీ.
మణిపూర్‌లో గత ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్‌ ఆశలపై నీళ్ళు చల్లుతూ బీజేపీ ఆధిక్యంలో దూసుకువెళుతోంది.
మూడు కోట్లకు పైగా జనాభా ఉన్న పంజాబ్‌లో... సర్వే నిర్వహించి మరీ.. భగవంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కేజ్రీవాల్‌. దాదాపు, 22లక్షల మంది సర్వేలో పాల్గొని... సర్దార్‌ భగవంత్ మాన్ పేరు సూచించారు. ఇప్పుడు, ఎన్నికల్లో భగవంత్‌ మాన్‌ వైపే మొగ్గు చూపారు పంజాబ్‌ ప్రజలు.
పార్టీ మారినా.. మళ్లీ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కే పట్టం కట్టారు పంజాబ్‌ ప్రజలు. మాజీ సైనికులకే తమ మద్దతు ప్రకటించారు. దేశరక్షణలో భాగం పంచుకున్నవారినే.. తమ సేవకుడిగా ఎన్నుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి... భగవంత్‌ మాన్‌ కూడా గతంలో ఆర్మీలో పనిచేసినవారే కావడం విశేషం.
పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అవును... టీవీ9 పోల్‌ స్ట్రాట్‌ సర్వేని నిజం చేస్తూ స్పష్టమైన మెజార్టీ
ఢిల్లీని దాటి పంజాబ్‌లో అడుగుపెట్టిన ఆప్
పంజాబ్‌లో ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని బట్టి సాధారణ మెజార్టీకి అవసరమైన సీట్లను బీజేపీ దాటింది. ఇక్కడ బీజేపీ 200 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యాల విషయంలో భాజపా సెంచరీని దాటేసింది. మరోవైపు పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌- ఆప్‌ల మధ్య పోటీ నువ్వా- నేనా అన్నట్లు ఉంది. రెండు పార్టీలు ఒకట్రెండు సీట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఐదు రాష్ట్రాలకు గత నెల 10 నుంచి ఈ నెల 7 వరకు వివిధ విడతల్లో పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఓటింగ్‌ను నిర్వహించారు.మణిపుర్​లో రెండు దశల్లో పోలింగ్​ జరగగా.. పంజాబ్​, ఉత్తరాఖండ్​, గోవాలో ఒకే దశలో పోలింగ్​ పూర్తయింది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 LIVE

మరిన్ని చదవండి >

ఉత్తరాఖండ్ సీటు ఎన్నికల ఫలితాలు

  • పార్టీ గెలిచిన సీట్లు ఓట్ల శాతం
  • BJP2,314,25046.51%
  • INC1,666,37933.49%
  • BSP347,5336.98%
  • SP18,2020.37%

Ads By Adgebra