Uttar Pradesh-Punjab Assembly Election 2022 Voting Live updates: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ,పంజాబ్అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. అయితే పంజాబ్‌లో ఓటింగ్ మందకోడిగా జరుగుతోంది. అదే ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక ఉత్తర ప్రదేశ్ జరుగుతున్న మూడో దశ పోలింగ్ పార్టీల భవితవ్యంను తేలనుంది. దీంతో బరిలో నిలిచిన రాజకీయ పార్టీలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో మూడవ దశలో 59 స్థానాలు పోలింగ్ జరుగుతోంది.
పంజాబ్‌లో 117 స్థానాలకు ఎన్నికలు ఒకే విడతలో జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల పోరులో మొత్తం 1304 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి పంజాబ్‌లో నాలుగు పెద్ద రాజకీయ పార్టీలు లేదా కూటముల మధ్య పోరు జరుగుతుందని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్ జరుగుతున్న 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.
ఈసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తామని ఆ పార్టీ ధీమాతో ఉంది. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ప్రముఖులు 31 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. పంజాబ్‌లో ఓటింగ్‌కు సంబంధించిన ప్రతి వార్తల కోసం, ఇక్కడ క్లిక్ చేస్తూ ఉండండి..
లఖింపూర్ ఖేరీలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భద్రత, శ్రేయస్సు కోసం రాష్ట్ర ఓటర్లు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌లను శాశ్వతంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికలు రుజువు చేశాయన్నారు. అదే సమయంలో ఈరోజు జరుగుతున్న మూడో దశ ఓటింగ్‌లో బీజేపీ వైపు ఓటర్లు భారీ ట్రెండ్ నెలకొందని యోగి స్పష్టం చేశారు.
लखीमपुर खीरी (विधान सभा- लखीमपुर खीरी व श्री नगर) में राष्ट्रवादी जन सैलाब… https://t.co/pe4Eltg50V
— Yogi Adityanath (@myogiadityanath) February 20, 2022
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడో దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 57.58% ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు యూపీలోని లలిత్‌పూర్‌లో అత్యధికంగా 67.37 శాతం మంది ఓటు వేయగా, కాన్పూర్ నగర్‌లో అత్యల్పంగా 50.88 శాతం ఓటింగ్ నమోదైంది. చాలా చోట్ల ఉదయం ఓటింగ్ వేగం మందగించగా, మధ్యాహ్నం తర్వాత మరింతగా పెరిగి ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. మరో గంటలో ఈ సంఖ్య చాలా చేరుకుంది. అన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन-2022
तीसरे चरण के अंतर्गत 16 जनपदों में सायं 05 बजे तक कुल औसतन मतदान 57.58% रहा।#ECI#विधानसभाचुनाव2022#AssemblyElections2022 #GoVoteUP#GoVoteUP_Phase3 pic.twitter.com/eZnzLX1z3h
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 20, 2022
పంజాబ్ శాసనసభలోని 117 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 63.44 శాతం పోలింగ్ నమోదైంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యానికి ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు దర్శనమివ్వడంతో ఓటర్లు తమ వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు.
ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ 2022
Punjab Assembly Elections 2022Total Average Voter Turnout in 23 Districts of Punjab
Till 05:00 PM-63.44%GO VOTE TODAY!!#govote #AssemblyElections2022 #COVIDsafeElections #TheCEOPunjab #PunjabVotes2022 #EveryVoteCounts @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/SPd6rURvlD
— Chief Electoral Officer, Punjab (@TheCEOPunjab) February 20, 2022
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దేరాబస్సీలోని బూత్ నంబర్ 292లో ఈవీఎంలు పనిచేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ఆరోపించారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించినా సమస్య పరిష్కారం దొరకలేదన్నారు.
For the last one hour EVM at Booth No. 292 in Dera Bassi is not functioning. We have already informed authorities but the malfunctioning still persists.@ECISVEEP please see.
— Raghav Chadha (@raghav_chadha) February 20, 2022
భగవంత్ మాన్ అతిపెద్ద అబద్ధాలకోరని మండిపడ్డారు కేంద్ర మంత్రి మీనాశ్రీ లేఖి. ఆప్‌ని తయారు చేయడానికి కాంగ్రెస్ ఎంత డబ్బు ఖర్చు చేసిందో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ బి టీమ్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని మోసం చేస్తోంది.ఇప్పుడు పంజాబ్‌ను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో రూ.524 కోట్ల ప్రకటనలు ఇవ్వడంతో పాటు ప్రజలను ఆప్ చేయడం తప్ప ఏం చేయలేదన్నారు మీనాక్షి లేఖి..
AAP is betraying Delhi and through the Delhi model, they are now trying to betray Punjab. What work have they done other than betraying the people and putting up advertisements worth Rs.524 crores in Delhi: MoS & BJP leader Meenakashi Lekhi#PunjabElections2022 pic.twitter.com/kTwFpxXNVe
— ANI (@ANI) February 20, 2022
ఉత్తరప్రదేశ్ మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 59 స్థానాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.81 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन-2022
तीसरे चरण के अंतर्गत 16 जनपदों में अपराह्न 03 बजे तक कुल औसतन मतदान 48.81% रहा।#ECI#विधानसभाचुनाव2022#AssemblyElections2022 #GoVote #GoVoteUP #GoVoteUP_Phase3 pic.twitter.com/H9OCdy5vbh
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 20, 2022
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిరోజ్‌పూర్ (అర్బన్) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త సూర్జిత్ సింగ్ గాయపడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటించనున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వరకు 49.81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రానికి పోలింగ్ మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ 2022
Punjab Assembly Elections 2022Total Average Voter Turnout in 23 Districts of Punjab
Till 03:00 PM-49.81%GO VOTE TODAY!!#govote #AssemblyElections2022 #COVIDsafeElections #TheCEOPunjab #PunjabVotes2022 #EveryVoteCounts @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/EWp3IwDhlm
— Chief Electoral Officer, Punjab (@TheCEOPunjab) February 20, 2022
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని పరమాపూర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు బారులు తీరి ఎదురుచూస్తున్నారు. దీంతో ఎన్నికల అధికారులు యంత్రాన్ని సరిచేసే పనిలో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ కాస్త పుంజుకుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు పంజాబ్‌లో 49.81 శాతం , ఉత్తరప్రదేశ్‌లో 48.81శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లరు బారులు తీరడంతో పోలింగ్ జోరందుకుంటుందని ఈసీ అధికారులు అనుకుంటున్నారు.
#AssemblyElections2022 Voting Percentage till 3pm –
Uttar Pradesh – 48.81%
Punjab – 49.81%— ANI (@ANI) February 20, 2022
భగవంతుని దయ వల్ల అందరూ భగవంత్ మాన్‌ను కోరుకుంటున్నారని ఆయన తల్లి హర్పాల్ కౌర్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ఆమె.. మనకు ఆయన ఇప్పటికే సీఎం అయ్యారన్నారు. ప్రజలు అతన్ని ప్రేమిస్తారు ఇంతకంటే ఏంకావాలన్నారు భగవంత్ మాన్ తల్లి హర్పాల్ కౌర్. పంజాబ్ ఎన్నికలలో AAP CM అభ్యర్థిగా భగవంత్ మాన్ బరిలో నిలిచారు. కాగా, అమ్మ ఇలా చెబితే ఇంకేం కావాలి.. యువత, విద్యార్థులు అందరూ మార్పు కోరుకుంటున్నారని భగవంత్ మాన్ తెలిపారు.
By God's grace, everyone loves him. For us, he has already become the CM. People love him: Harpal Kaur, mother of Bhagwant Mann,AAP CM candidate for poll-bound Punjab
If a mother has said this, what else does one want…
Youth,students everyone wants a change:Bhagwant Mann, AAP pic.twitter.com/bnaGTO3ijc— ANI (@ANI) February 20, 2022
ఉత్తరప్రదేశ్‌లో కొత్త కూటమి కులం పేరుతో విషం చిమ్ముతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఎస్పీ, బీఎస్పీలపై విరుచుకుపడ్డారు. అలాంటి వారు కుర్చీ కోసం సొంత కుటుంబంతో గొడవ పడతారు. మీరు ఓటు వేసిన డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదు. కేంద్రంలోని ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదు. మా ప్రభుత్వం పేదలు, రైతులు, యువత కోసమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
These 'parivarvadis' are now spreading venom in the name of caste. Such people fight with their own family for chair. The double engine govt you voted for doesn't belong to any family, nor the govt at Centre belongs to any family. Our govt is for the poor,farmer & youth: PM Modi pic.twitter.com/bYuk0XWB7u
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
పంజాబ్‌లోని పాటియాలాలోని నాభా గ్రామంలో నవ వధువు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ష్‌ప్రీత్ కౌర్ అనే యువతి పెళ్లికి ముందు పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
పంజాబ్‌లో 2/3వ వంతు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు.
The Congress party will form government with 2/3rd majority in Punjab: CM Charanjit Singh Channi, at Kharar pic.twitter.com/zTBA5TmYXr
— ANI (@ANI) February 20, 2022
పంజాబ్‌లో అకాలీదళ్-బీఎస్పీ 80కి పైగా సీట్లు గెలుచుకుంటాయని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చెప్పారు. ముక్త్‌సర్‌లో ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది అకాలీదళ్-బీఎస్పీ కూటమియే అన్నారు.
Akali Dal-BSP will win 80-plus seats in Punjab, says Sukhbir Singh Badal
Read @ANI Story | https://t.co/IePIgSl9kr#PunjabElections2022 pic.twitter.com/3LfQx78Uat
— ANI Digital (@ani_digital) February 20, 2022
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ బాదల్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ముక్త్‌సర్‌లో ఓటు వేశారు. కుటుంబసమేతంగా తరలివచ్చిన ముక్త్‌సర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Shiromani Akali Dal (SAD) president Sukhbir Singh Badal along with Parkash Singh Badal and Harsimrat Kaur casts his vote at Muktsar in #PunjabElections2022 pic.twitter.com/bksQO4TVqw
— ANI (@ANI) February 20, 2022
ఉత్తరప్రదేశ్‌లో మూడో విడతలో మధ్యాహ్నం 1 గంట వరకు 16 జిల్లాల్లో 35.88 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా ఏటాలో 42.31 శాతం, లలిత్‌పూర్‌లో 42.10 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కాన్పూర్ పట్టణంలో 28.56 శాతం పోలింగ్ నమోదైంది.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन-2022
तीसरे चरण के अंतर्गत 16 जनपदों में अपराह्न 01 बजे तक कुल औसतन मतदान 35.88% रहा।#ECI#विधानसभाचुनाव2022#AssemblyElections2022 #GoVote #GoVoteUP #GoVoteUP_Phase3 pic.twitter.com/69cLkTucEc
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 20, 2022
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంజాబ్‌లో 34.1 శాతం పోలింగ్ నమోదు జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లరు బారులు తీరడంతో పోలింగ్ జోరందుకుంటుందని ఈసీ అధికారులు అనుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు మూలయం సింగ్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జస్వంత్‌పూర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అదే పోలింగ్ బూత్‌లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఓటు వేశారు.
#WATCH | Etawah | Samajwadi Party (SP) founder-patron Mulayam Singh Yadav arrives at a polling booth in Jaswantnagar, Saifai to cast his vote for the third phase of #UttarPradeshElections2022 pic.twitter.com/k59H8zsnEC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు మూడో దశలో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్ నమోదు అయింది.
మొగా జిల్లాలో నటుడు సోనూ సూద్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఆయన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ టికెట్‌పై మోగా నుంచి పోటీ చేస్తున్నారు. సోనూసూద్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై శిరోమణి అకాలీదళ్ ఫిర్యాదు చేసింది.
పంజాబ్‌లోని మోగాలో నటుడు సోనూ సూద్ కారును సీజ్ చేశారు. జిల్లా PRO ప్రభదీప్ సింగ్ మాట్లాడుతూ.. “సోనూ సూద్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా అతడి కారును సీజ్ చేసి.. సోనూ సూద్‌ను ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే కేసులు పెడతామన్నారు అధికారులు.
Sonu Sood was trying to enter a polling booth. During this, his car was confiscated and he was sent home. Action will be taken against him if he steps out of his house: Moga District PRO Pradbhdeep Singh
His sister Malvika Sood is contesting from Moga as a Congress candidate. pic.twitter.com/Ueeb7CNy8t
— ANI (@ANI) February 20, 2022
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు, కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది.
#PunjabElections2022 | I am certain of winning Patiala. I think we will win the elections…They (Congress) live in a different world & will be wiped out in Punjab: Capt Amarinder Singh, Punjab Lok Congress founder, at Patiala pic.twitter.com/jrt2a2PPnb
— ANI (@ANI) February 20, 2022
పంజాబ్‌లో ఉదయం 11 గంటల వరకు 17.77 శాతం ఓటింగ్ నమోదు.
ఉత్తరప్రదేశ్‌లో మూడో విడతలో 16 జిల్లాల్లో ఉదయం 11 గంటల వరకు సగటున 21.18 శాతం పోలింగ్ జరిగింది. అంతకుముందు రాత్రి 9 గంటల వరకు సగటున 8.15% ఓటింగ్ జరిగింది. అత్యధికంగా లలిత్‌పూర్‌లో 26 శాతం, అత్యల్పంగా కాన్పూర్ పట్టణంలో 16.79 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలించండి.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन-2022
तीसरे चरण के अंतर्गत 16 जनपदों में पूर्वाह्न 11 बजे तक कुल औसतन मतदान 21.18% रहा।#ECI#विधानसभाचुनाव2022#AssemblyElections2022 #GoVote #GoVoteUP #GoVoteUP_Phase3 pic.twitter.com/dQmao2xfZm
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 20, 2022
జస్వంత్‌నగర్‌లో ఓటు వేసిన అనంతరం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. యూపీ రైతులు వారిని క్షమించరని.. తొలి రెండు దశల్లో సెంచరీలు బాదిన మేం.. ఈ దశలో కూడా ఎస్పీ, కూటమి అందరికంటే ముందుంటుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ భవిష్యత్తుకు ఈరోజు చాలా ముఖ్యమని వీడియో మెసెజ్ ద్వారా తెలిపారు. పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజలు సురక్షితంగా భావించే భవిష్యత్తుకు ఇది సరైన సమయం అని అన్నారు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మిగిలినవి తర్వాత చేయండి.. ముందుగా ఓటు వేయండి. యువత తమ వెంట తమ ఇంటి పెద్దలను కూడా తీసుకెళ్లాలి.
కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే ఈరోజు పోలింగ్ బూత్ లోపల ఫోటోలు, వీడియోలు క్లిక్ చేయడం వివాదంగా మారింది. యుపి అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా పాండే ఓటు వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఫోటోను షేర్ చేశారు. పాండే కాన్పూర్‌లోని హడ్సన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశారు. ఆమె ఓటు వేస్తున్నప్పుడు వీడియోను చిత్రీకరించుకున్నారు.. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ అవుతోంది. దీంతో అధికారులు చర్యలు తీసుకునేందుక ఉపక్రమించారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది పోలింగ్ సమయలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫతేఘర్, హత్రాస్, హమీర్‌పూర్‌లోని పోలింగ్ స్టేషన్‌లలో వృద్ధులు, వికలాంగ ఓటర్లకు సహాయం చేస్తున్నారు.
Indo-Tibetan Border Police (ITBP) personnel, deployed at polling booths in Fatehgarh, Hathras and Hamirpur, assist the elderly and differently-abled voters.
Voting underway for the third phase of #UttarPradeshElections2022 today. pic.twitter.com/94dbNZrn1h
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
अमृतसर: पंजाब कांग्रेस के अध्यक्ष नवजोत सिंह सिद्धू और उनकी पत्नी नवजोत कौर सिद्धू ने स्वामी सत्यानंद कॉलेज पोलिंग बूथ पर वोट डाला। #PunjabElections2022 pic.twitter.com/GTur6vCZ2C
— ANI_HindiNews (@AHindinews) February 20, 2022
ఆకాలీదళ్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఆప్ ట్వీట్ చేసింది. గురు హర్ సహాయ్ అసెంబ్లీ స్థానంలోని బూత్ నంబర్ 23 బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఆరోపించారు. వారు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి తమ ఎన్నారై కుటుంబ సభ్యులను (తమ తరపున ఎవరైనా) ఓటు వేసేందుకు అనుమతించాలని, లేకుంటే ఎవరినీ ఓటు వేయనివ్వబోమని పోలింగ్ అధికారులను బెదిరిస్తున్నరని పేర్కొంది.
Reports coming in from Guru Har Sahai AC, Booth No. 23. Capturing attempted by SAD workers. They entered booth & are asking polling officers to let their NRI family members to vote (through someone on their behalf) else they won’t allow anyone to vote.@ECISVEEP for action pls
— Raghav Chadha (@raghav_chadha) February 20, 2022
మాజీ ముఖ్యమంత్రులపై విమర్శిలు గుప్పించాడు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ. పంజాబ్‌ను తమ వ్యక్తిగత వ్యాపారా ప్రయోజనాలతో వాడుకున్నారని మండిపడ్డారు. చెదపురుగులను కెప్టెన్ అమరీందర్, ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబాలు పెంచి పోషించారని మండిపడ్డారు. ఆ వ్యవస్థను మార్చాలనుకునే తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
एक तरफ माफिया है, कैप्टन अमरिंदर और प्रकाश सिंह बादल के परिवार जिन्होंने पंजाब की कोस्ट पर निजी स्वार्थों से बंधे होकर अपना व्यापार चलाया और पंजाब को दीमक की तरह चाटा। दूसरी तरफ उस सिस्टम को बदलने की चाह रखने वाले, पंजाब को प्यार करने वाले हैं: पंजाब कांग्रेस अध्यक्ष नवजोत सिद्धू pic.twitter.com/seKC6jGYZr
— ANI_HindiNews (@AHindinews) February 20, 2022
పంజాబ్‌లో మందకోడిగా పోలింగ్ సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 4.80% పోలింగ్ నమోదైంది. ఎందుకు ఇంత నెమ్మదిగా ఓటింగ్ జరుగుతోందని అధికార, ప్రతిపక్ష పార్టీ చర్చించుకుంటున్నాయి.
ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ਬਾਬਾ ਸਾਹਿਬ ਅਤੇ ਭਗਤ ਸਿੰਘ ਜੀ ਦੇ ਸੁਪਨਿਆਂ ਦੇ ਪੰਜਾਬ ਨੂੰ ਧਿਆਨ ਵਿੱਚ ਰੱਖਦੇ ਹੋਏ ਆਪਣੀ ਵੋਟ ਪਾਈ…ਪੰਜਾਬ ਦੇ ਸੁਨਹਿਰੇ ਭਵਿੱਖ ਲਈ ਤੁਸੀਂ ਵੀ ਆਪਣਾ ਫ਼ਰਜ਼ ਨਿਭਾਇਓ…ਵੋਟ ਜ਼ਰੂਰ ਪਾਉਂਣ ਜਾਇਓ.. pic.twitter.com/Ix9hkKt72b
— Bhagwant Mann (@BhagwantMann) February 20, 2022
పంజాబ్ అమృత్‌సర్ ఓటింగ్‌లో అవిభక్త కవలలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సోహ్నాసింగ్, మోహ్నాసింగ్..తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకే శరీరాన్ని పంచుకున్న ఈ ఇద్దరు సోదరులు మనావాలాలో ఓటు వేశారు. వీరు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. ఒకరు వేసిన ఓటు మరొకరు చూడకుండా ఉండేందుకు వారికి గాగుల్స్ కూడా ఇచ్చారు ఎన్నికల అధికారులు. పంజాబ్ అమృత్‌సర్‌లో ఓటు వేసిన ట్విన్స్ సోధరులు తమ ఓటు వేశారు. వీరి కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పంజాబ్ లో పోలింగ్‌కు ముందు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన అనుచరులతో కలిసి ఖరార్‌లోని గురుద్వారా శ్రీ కటల్‌గర్ సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించారు. సీఎం చన్నీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
యూపీలో అఖిలేశ్ యాదవ్ గెలుపు తథ్యమని ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 300కు పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటేసే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములాయం మరో సోదరుడు అభయ్ రామ్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైఫాయ్ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
Conjoined twins, Sohna and Mohna, cast their votes at polling booth no.101 in Manawala, Amritsar. #PunjabElections pic.twitter.com/qx2pxuJ2N9
— ANI (@ANI) February 20, 2022
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోనూసూద్ సోదరికి మద్దతుగా వీడియో పోస్ట్ చేశారు. ‘నా సోదరుడు సోనూ సూద్ సోదరి మాళవికకు శుభాకాంక్షలు. ఈ కుటుంబం నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు వీరికి అపారమైన శక్తిని ఇచ్చాడు. మీరు ప్రజలకు సహాయం చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ హర్భజన్ సింగ్ వీడియో పోస్ట్ లో పేర్కొన్నారు.
పంజాబ్, యూపీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంగా తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత తమ ఓటు సరైన పద్దతిలో వినియోగించుకోవాలని సూచించారు.
The Punjab elections and the third phase of the UP elections are being held today. I call upon all those voting today to do so in large numbers, particularly the youth as well as first time voters.
— Narendra Modi (@narendramodi) February 20, 2022
పంజాబ్‌కు ఇది గొప్ప రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు, అత్యాశకు గురికాకుండా మీ స్వంత ఇష్టానుసారం ఓటు వేయండి. ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
Mohali | It is a big day for #Punjab today. Congress & BJP have come together to put allegations on my party and me, but the people of Punjab know everything: Aam Aadmi Party’s CM candidate Bhagwant Mann
Mann is contesting from Dhuri, Sangrur pic.twitter.com/nhOHUPxuNj
— ANI (@ANI) February 20, 2022
ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ కోణంలోనూ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఆప్‌కు సీట్లు తగ్గి.. కాంగ్రెస్ సైతం మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోతే ఆ తరవాత బీజేపీ పావులు కదపాలని వ్యూహరచన చేస్తోంది. పంజాబ్‌లో డేరాల(ఆశ్రమలు) ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడి ఆరు డేరాలు 68 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపగలవని రాజకీయ విశ్లేషకుల అంచనా.. అయితే ఈ స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకుంటే.. బీజేపీ ప్లాన్ సాఫీగా సాగుతుంది. అయితే.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ- రాధా స్వామి సత్సంగ్ అధిపతి బాబా గురీందర్ సింగ్‌తో సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమృత్‌సర్‌లో అకాల్ తఖ్త్ బాధ్యులు జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్‌నూ కలిశారు. నూర్ మహల్ డేరా, డేరా సచ్‌ఖండ్ బల్లాన్, సంత్ నిరంకారి మిషన్ తదితర అధిపతులతో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వారు కూడా సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
పంజాబ్ అసెంబ్లీకి ఓటింగ్ ప్రారంభమైంది.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ మొదలైంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశ పోలింగ్ స్వరూపం..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లోని అన్ని స్థానాలకు.. యుపిలోని మూడవ దశకు ఓటు వేయడానికి ముందు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేస్తూ, ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా మీ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఓటు అమూల్యమైనదని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
लोकतंत्र के महापर्व चुनाव में आप मतदान कर अपनी सहभागिता अवश्य सुनिश्चित करें।
आज पंजाब में विधानसभा की सभी सीटों और उत्तर प्रदेश में तीसरे चरण की सीटों के लिए सम्मानित नागरिक अपना कर्तव्य निभाएं, अधिकार का करें उपयोग। लोकतंत्र की मजबूती के लिए एक-एक मत अमूल्य है। #GoVote
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 20, 2022
బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్ జరుగుతున్న 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తామని ఆ పార్టీ ధీమాతో ఉంది. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ప్రముఖులు 31 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. సీఎం యోగి ఐదు జిల్లాల్లో కేవలం 28 గంటల్లో 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల 2022 కోసం మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈసారి మొత్తం 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇది పంజాబ్‌లో 16వ ఎన్నికలు.