UP Election Results Updates: ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ప్రారంభ ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఉన్నాయి. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపులో ఆయా రాష్ట్రాల్లో ట్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం
ఉత్తరప్రదేశ్ ఓట్ల లెక్కింపు..
ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే అధికార బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 249 నియోకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ, మిత్ర పక్షాలు 131 స్థానాల్లో, బీఎస్పీ15, కాంగ్రెస్ 5, ఇతరులు3 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.
గోవా ఓట్ల లెక్కింపు..
గోవాలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ 16, బీజేపీ 16, టీఎంసీ 4, ఇతరులు 3స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆప్ ఒక స్థానంలో ఆధిక్యత కనబరుస్తోంది
పంజాబ్ ఓట్ల లెక్కింపు..
పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆప్ 58, కాంగ్రెస్ 31, ఎస్ఏడీ 18 బీజేపీ 9, ఇతరులు1 నియోకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఉత్తరాఖండ్ లో ఓట్ల లెక్కింపు..
పంజాబ్ లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ 44, కాంగ్రెస్ 21, ఇతరులు 4స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
మణిపుర్ లో ఓట్ల లెక్కింపు
మణిపుర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ 23, కాంగ్రెస్ 14, ఎన్ పీపీ 10, ఎన్ పీఎఫ్ 5, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
(ఈ ఆర్టికల్ అప్ డేట్ చేయబడుతుంది. గమనించగలరు)
Also Read
Kiran Abbavaram : కుర్ర హీరోతో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.. కిరణ్ అబ్బవరం దశ తిరిగినట్టే..