సీఎం పళనిస్వామిపై నీచమైన వ్యాఖ్యల ప్రతిఫలం, తమిళనాట ఆగ్రహజ్వాలలు.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు

|

Mar 28, 2021 | 9:35 PM

DMK MP A Raja booked for alleged vulgar comments : తమిళనాడు సిఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు డిఎంకె ఎంపి.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు నమోదు చేశారు తమిళనాడు..

సీఎం పళనిస్వామిపై నీచమైన వ్యాఖ్యల ప్రతిఫలం, తమిళనాట ఆగ్రహజ్వాలలు.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు
Follow us on

DMK MP A Raja booked for alleged vulgar comments : తమిళనాడు సిఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు డిఎంకె ఎంపి.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేసినట్లు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ చెప్పారు. భారత శిక్షాస్మృతి, ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద ఈ కేసు నమోదైంది. కాగా, ముఖ్యమంత్రి కె పళనిస్వామిపై అసభ్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అధికార ఎఐఎడిఎంకె పార్టీ ప్రతినిధులు నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, సేలం, కరూర్ జిల్లాల్లో రాజా వ్యాఖ్యలకు నిరసనగా ఎఐఎడిఎంకె కార్యకర్తలు, నేతలు ఇవాళ (ఆదివారం) నిరసన వ్యక్తం చేశారు. రాజా దిష్టిబొమ్మను పలు చోట్ల దహనం చేశారు.

ఎఐఎడిఎంకె మిత్రపక్షమైన బిజెపి కూడా రాజా వ్యాఖ్యలపై విరుచుకుపడింది. డిఎంకె పార్టీ మహిళలను గౌరవించదంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించగా, ఎవరి పేరును ప్రస్తావించకుండా డిఎంకె అధ్యక్షుడు ఎం కె స్టాలిన్ స్పందించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీ సభ్యులు గౌరవప్రదమైన వ్యాఖ్యలు చేయాలన్నారు. ప్రత్యర్థులు ప్రసంగాలను వక్రీకరిస్తాయన్న విషయాన్ని గుర్తించుకుని మెలగాలంటూ రాజాకు పరోక్షంగా బహిరంగ సూచనలు చేశారు స్టాలిన్.

ఇంతకీ డిఎంకె నేత ఎ రాజా ఏమంటే ఈ అంశం అంత తీవ్ర వ్యతిరేకతకు గురైందంటే.. నిన్న చెన్నై పరిధిలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి డాక్టర్ ఎన్.ఎళిలన్ తరఫున రాజా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తమళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే అధినేత స్టాలిన్ కాలి చెప్పుతో పోల్చారు. అంతేనా.. ‘అక్రమ సంబంధం కారణంగా పుట్టిన అపరిపక్వ రాజకీయ శిశువు’ అని ముఖ్యమంత్రి పళనిస్వామిని విమర్శించారు. అదే సమయంలో స్టాలిన్ ను మాత్రం ‘నికరంగా పుట్టిన పరిణతి చెందిన బాలుడు’ అని కామెంట్ చేశారు రాజా. అంతేకాదు, ఏరోజుకారోజే బెల్లం మార్కెట్టులో పనిచేసుకుంటూ పదవిలోకి వచ్చిన పళనిస్వామిని స్టాలిన్ తో ఎలా పోల్చగలం? అని రాజా అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు ‘స్టాలిన్ కాలిచెప్పు నీకంటే ఓ రూపాయి ఎక్కువ ధరే పలుకుతుంది… నువ్వా స్టాలిన్ కు సవాల్ విసిరేది?’ అని రాజా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదే ఇప్పుడు తమిళనాట ఉద్రిక్తతలకు కారణమవుతోంది.

Read also : Khushboo promises : ప్రతీ ఆడపిల్లకీ లక్ష డిపాజిట్ చేస్తా.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్ముతోన్న సినీనటి ఖుష్భూ