పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల , మాజీ సీఎం వీ. నారాయణస్వామికి మొండిచెయ్యి

| Edited By: Anil kumar poka

Mar 17, 2021 | 10:38 AM

పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ పేర్లలో మాజీ సీఎం వీ. నారాయణ స్వామి పేరు లేదు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని చూసుకుంటారని...

పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల , మాజీ సీఎం వీ. నారాయణస్వామికి మొండిచెయ్యి
In Puducherry Elections Former Cm Narayanaswami Will Campaign For Party Says Leader Dinesh Gundu Rao
Follow us on

పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ పేర్లలో మాజీ సీఎం వీ. నారాయణ స్వామి పేరు లేదు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని చూసుకుంటారని, ఎలెక్షన్ మేనేజ్ మెంట్ లో కీలక పాత్ర వహిస్తారని పార్టీ నేత దినేష్ గుండూరావు తెలిపారు. నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని చెప్పిన ఆయన.. 14 మంది అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేశామన్నారు. పుదుచ్చేరి లోని 30 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ఏప్రిల్ 6 న జరగనుంది.  ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభిస్తుందని ఆశించిన నారాయణస్వామి తనకు అవకాశం దక్కక పోవడంతో ఆశాభంగం చెందారు. గత ఎన్నికల్లో పార్టీ  విజయానికి కృషి చేసిన తనకు, తన సహచరుల్లో కొంతమందికి టికెట్లు లభించకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా-30 స్థానాల్లో ఐదింటిని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. నారాయణస్వామి నేతృత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్ల పాలనను పూర్తి చేసుకోలేకపోయింది.  ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఆయన ప్రభుత్వం గత ఫిబ్రవరి చివరి వారంలో మైనారిటీలో పడిపోయింది. 22 న ఆయన అసెంబ్లీలో బల పరీక్షను నిరూపించుకోలేక పోయారు. చివరకు రాజీనామా చేశారు. 23 న ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు.

అనంతరం పుదుచ్చేరిలో రాష్ట్రపతి  పాలన విధించారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను, ఎన్ ఆర్ కాంగ్రెస్ 8 స్థానాలను, అన్నాడీఎంకే నాలుగింటిని, డీఎంకే రెండు సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. కాగా ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి తాను కృషి చేస్తానని నారాయణస్వామి చెప్పారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని చదవండి ఇక్కడ : 
TV9 Telugu 4 Minutes 24 Headlines Video: కౌంటింగ్ కౌన్‌డౌన్.. మొదలైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.

గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.