By-poll Results 2022: నాలుగు రాష్ట్రాల బై పోల్స్‌లో బీజేపీకి బిగ్ షాక్.. పుంజుకున్న కాంగ్రెస్..

|

Apr 17, 2022 | 6:08 AM

By-poll Results 2022: నాలుగు రాష్ట్రాల బై పోల్స్ రిజల్ట్ బీజేపీకి జలక్ ఇచ్చాయి. ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పత్తా లేకుండా పోగా..

By-poll Results 2022: నాలుగు రాష్ట్రాల బై పోల్స్‌లో బీజేపీకి బిగ్ షాక్.. పుంజుకున్న కాంగ్రెస్..
Elections Results
Follow us on

By-poll Results 2022: నాలుగు రాష్ట్రాల బై పోల్స్ రిజల్ట్ బీజేపీకి జలక్ ఇచ్చాయి. ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పత్తా లేకుండా పోగా.. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది. అవును, నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. ఐదు స్థానాలకు జరిగిన బైపోల్స్ లో బీజేపీ ఓటమి పాలయ్యింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ, కాంగ్రెస్, ఆర్జేడీలు గెలుపొందాయి. ఇక బాలీవుడ్‌ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా.. అసన్సోల్ బైపోల్ లో భారీ విజయం సాధించి షాట్‌గన్‌గా పేలాడు. రికార్డు మార్జిన్‌తో సంచలన విజయం సాధించాడు. పశ్చిమ బెంగాల్‌ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా అసన్సోల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి టీఎంసీ అక్కడ మొదటిసారి విజయం కట్టబెట్టాడు.

బీజేపీ అహంకారాన్ని బైపోల్స్ ద్వారా అణచివేశారన్నారు బాలీగంజ్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందిన తృణ‌మూల్ అభ్యర్థి బాబుల్ సుప్రియో. బాలీగంజ్ ప్రజలు స‌రైన తీర్పునిచ్చారని.. కాషాయ పార్టీ అహంకారాన్ని దెబ్బతీశార‌ని అన్నారు బాబుల్ సుప్రియో. బీహార్‌ లోని బొచహార్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధి గెలుపొందారు. ఆర్జేడీ అభ్యర్థి అమ‌ర్ కుమార్ పాశ్వాన్ స‌మీప బీజేపీ అభ్యర్థి బీబీ కుమారిపై 35 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. చత్తీస్‌ఘడ్‌ లోని ఖైరఘర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపొందారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ గెలిచింది.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!