Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?

, రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కూడా ఈ సమస్య అందర్నీ పీడిస్తుంది. బీపీ, షుగర్, మానసిక ఒత్తిడి ముఖ్యంగా గుండెజబ్బులకు ప్రధాన కారణాలు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉంటుంది.

, రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?

కానీ.. ఇప్పుడు గుండెజబ్బులు రావడానికి ప్రధానకారణం మద్యం(ఆల్కాహాల్). రోజూ మద్యం సేవించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నార్త్ కారోలినాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. వీరు దాదాపు 17,000 మందిపై పరిశోధనలు చేయగా.. వీరందరూ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలియజేశారు. మద్యం మొక్క ప్రభావం లివర్, ఊపిరితిత్తులపైనే కాకుండా మెదడు, గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు.

, రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?

ఆల్కాహాల్లో కేలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజూ వీటినే తీసుకోవడం ప్రమాదకరమని చెప్పారు. దేనినైనా శరీరానికి సమపాలల్లో తీసుకోవడం మంచిది. రోజూ కేలరీస్‌‌నే తీసుకోవడం వల్ల బాడీకి అవసరమయ్యే మిగతా ప్రోటీన్స్, విటమిన్స్ అందకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తాయని పరిశోధకులు తెలిపారు. వారానికి 13 గ్లాసులకు మించి మద్యపానం సేవించే వారు గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలియజేశారు.

, రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?

ఆల్కాహాల్ రక్తంలో కలిసిపోయి గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని కూడా పాడు చేస్తుందని.. దీని వల్ల అప్పుడప్పుుడు గుండె పట్టేసినట్లుగా ఉటుందన్నారు. పురుషులైనా, మహిళలైనా మోతాదుకు మించి తాగితే ప్రమాదాలు తప్పవని సూచించారు. అలాగే.. ఆల్కాహాల్ తాగుతుండడం వల్ల తీపి పదార్థాలు తినాలనిపిస్తుందట. దీంతో షుగర్ కూడా వచ్చే ప్రమాదముందని తెలిపారు. షుగర్ వ్యాధి చాలా ప్రమాదమని తెలిపారు. షుగర్ ఉన్న వాళ్లు ఆల్కాహాల్ అస్సలు తాగకూడదని వెల్లడించారు.

, రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?