ఓరి నీ వేషాలో.. ష్యూర్.. ఆస్కార్ అవార్డు నీకే..!

Dramatic dog faints to avoid nail trimming, ఓరి నీ వేషాలో.. ష్యూర్.. ఆస్కార్ అవార్డు నీకే..!

నటనలో ఈ శునకం పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లనే మించేలా ఉంది. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అని ఏమీ అనకుండానే తనలోని నటనను బయటికి తీసింది. ఇంకా తన యజమాని ఏమీ అనకుండానే.. ఓరేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రెండు రోజుల్లో సెలబ్రిటీగా మారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క గోర్లు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది. దాని కోసం కుక్క కాలిని తన చేతిలోకి తీసుకొని కట్టర్‌తో గోర్లు కట్ చేయాలని ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్లుండి మూర్ఛబోయినట్లుగా నటిస్తూ కింద పడిపోయింది. అంతేనా.. కాళ్లు రెండు బార్లా చాపి.. కళ్లు తేలేసింది. ఇక ఈ వీడియో మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 60లక్షల మందికి పైగా వీక్షించారు. ఓరీ నీ వేషాలు.. నీకు కచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇంత నటించినా ఆ కుక్కకు మాత్రం ప్రయోజనం దక్కలేదు. యజమాని పట్టుబట్టి మరీ దాని గోళ్లు కత్తిరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *