అలా చేశారో… ఆరు నెలలు జైలే..!

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. అగ్రరాజ్యాలను అతలాకుతలం చేసిన కొవిడ్-19 యూఏఈలో కూడా క్రమంగా విస్తరిస్తోంది.

అలా చేశారో... ఆరు నెలలు జైలే..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 2:23 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. అగ్రరాజ్యాలను అతలాకుతలం చేసిన కొవిడ్-19 యూఏఈలో కూడా క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను చులకనగా చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఎక్కువయ్యాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. బాధితుల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి గౌరవానికి భంగం కలిగించే సందేశాలను ఇతరులకు షేర్‌చేసే వారిని కూడా వదలబోమని పోలీసులు స్పష్టం చేశారు.

మరోవైపు.. ఈ నేరాలకు పాల్పడే వారికి సుమారు ఆరు నెలల జైలు శిక్షతో పాటు అధిక మొత్తంలో ఫైన్‌కూడా పడే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరించారు. యూఏఈలో ఇప్పటి వరకు 4,123 కరోనా కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 1.14లక్షలకు చేరింది. అన్ని దేశాల్లో కలిపి 18.5లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read: లాక్‌డౌన్ నేపథ్యంలో.. సజీవంగా సూట్ కేసులో..!

Also Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: కేంద్రమంత్రికీ తప్పని కరోనా కష్టాలు.. 

Also Read: 1600 కిలోమీటర్లు నడిచి ఇంటికి వస్తే.. షాక్..