1600 కిలోమీటర్లు నడిచి ఇంటికి వస్తే.. షాక్..!

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్ ఇప్పుడు మానవ సంబంధాలను కూడా అంతం చేస్తోంది. యూపీలోని వారణాసిలో సప్తసాగర్ కు

1600 కిలోమీటర్లు నడిచి ఇంటికి వస్తే.. షాక్..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 5:28 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్ ఇప్పుడు మానవ సంబంధాలను కూడా అంతం చేస్తోంది. యూపీలోని వారణాసిలో సప్తసాగర్ కు చెందిన అశోక్ కేసరి ముంబైలోని నాగ్‌పాడ ప్రాంతంలోని ఒక హోటల్‌లో పని చేస్తున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో తన ఆరుగురు స్నేహితులతోపాటు 14 రోజులపాటు 1600 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వారణాసిలోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే తల్లి తలుపులు తెరవలేదు.

మరోవైపు.. అశోక్ 14 రోజుల క్రితం స్నేహితులతో పాటు వారణాసికి బయలుదేరాడు. ఈ విషయాన్ని అశోక్ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారణాసి వచ్చిన వెంటనే అశోక్ ఇంటికి చేరుకోకుండా డివిజనల్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ నేపథ్యంలో వైద్యులు 14 రోజుల పాటు అశోక్ గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు. దీనితో అశోక్ ఇంటికి వచ్చి, తలుపు తట్టాడు. తల్లి ఇంట్లోనే ఉన్నా తలుపు తీయలేదు. అశోక్ ముంబైలో కరోనా బారిన పడ్డాడని ఆమె భయపడింది. ఈ ఉదంతంపై ఇన్ స్పెక్టర్ మహేష్ పాండే మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో అశోక్ కు వైద్య పరీక్షలు అయ్యాక, అతను ఇంట్లో ఉండడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని, దీనితో అతనిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు.

Also Read: వాహనదారులకు అలర్ట్: అక్కడ.. నో మాస్క్… నో పెట్రోల్…