Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామన్న ట్రంప్

Donald Trump's Speech At Howdy Modi.. Event In US, ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామన్న ట్రంప్

భారత్- అమెరికా కలల సాకారం కోసం ప్రధాని మోదీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ర పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వాగత ప్రసంగం అనంతరం అధ్యక్షుడు ట్రంప్ “హౌడీ-మోదీ” కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. తనను ఆహ్వానించిన హ్యూస్టన్ వాసులకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెల్పారు ట్రంప్. కొద్ది రోజుల క్రితమే మోదీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ఇటీవల ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మరోసారి హూస్టన్ వేదికగా మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ చారిత్రక సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్న ట్రంప్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ బాగా పనిచేస్తున్నారని.. భారత్‌‌ో 30 కోట్ల మంది భారతీయుల్నిపేదరికం నుంచి దూరం చేశారని అన్నారు. అంతేకాదు.. 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు భారత్ ఆస్తి అన్నారు. ప్రస్తుతం అమెరికా- భారత్ మైత్రి మరింత బలపడుతుందని.. ఇరు దేశాల మధ్య మైత్రీబంధానికి ఈ సమావేశం నిదర్శనమని అన్నారు. అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని ట్రంప్ అన్నారు. అమెరికాలో నాలుగేళ్లలో నిరుద్యోగాన్ని బాగా తగ్గించామన్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తున్నాయన్నారు. అమెరికాలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని.. నాలుగేళ్లలో కోటీ 40లక్షల మందికి కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని ట్రంప్ అన్నారు. భారత్‌- అమెరికాలు రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయని.. సరిహద్దు భద్రత అనేది భారత్‌, అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా హ్యూస్టన్‌ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారని.. ఈ సభకు 50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకమని అన్నారు.