Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

షాకింగ్.. గెలిచేది మేమేనంటూ కమలనాథుల సంచలన ట్వీట్స్.. ధీమా అదేనా..?

Delhi Elections: Save This Tweet.. BJP Is Winning.. Says Manoj Tiwari and SAD Leader.. Rejecting Exit Polls, షాకింగ్.. గెలిచేది మేమేనంటూ కమలనాథుల సంచలన ట్వీట్స్.. ధీమా అదేనా..?

ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. ఢిల్లీ పీఠం కేజ్రీకి దక్కుతుందంటూ తేల్చేస్తే.. మరోవైపు కమలనాథులు విజయం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గెలుపు మాదేనని.. ప్రతీపార్టీ చెప్తుంది కానీ.. ఈ సారి ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు మాత్రం.. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమయ్యాయంటున్నారు. అంతేకాదు.. ఢిల్లీ పీఠం ఎక్కేది కమలనాథులేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన అనంతరం.. ఎగ్జిట్‌పోల్స్‌ రిజల్ట్స్ వెలువడిన కొద్ది సేపటికే.. బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున.. ఎగ్జిట్‌పోల్స్‌ విఫలమవుతాయని, బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. మీకు అనుమానం ఉంటే.. ఈ ట్వీట్ సేవ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్ రోజు మాట్లాడండి అంటూ.. ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇక బీజేపీ మిత్రపక్షమైన అకాలీ దళ్‌కి చెందిన నేత మన్జిందర్ సింగ్ సిర్సా కూడా ఇదే విధంగ ట్వీట్ చేశారు. ఢిల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతోందని.. ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తలకిందులైతాయని.. కావాలంటే.. నేను చేసిన ఈ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

స్పష్టమైన ఆధిక్యంతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఆ తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దంటూ ఆప్‌ను ఉద్దేశించి తివారీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా ఇద్దరు నేతలు చాలా స్పష్టంగా బీజేపీదే గెలుపు అని చెప్పడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఓటర్ల నాడిని పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయా..?లేక.. కావాలనే వీరు ఇలా ప్రచారం చేస్తున్నారా అన్నది.. రిజల్ట్స్ రోజు తేలిపోనుంది.

Related Tags