Crime News: పెళ్లి కాకముందే కాబోయే భర్త వేధింపులు.. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి వచ్చిన యువతి ఆత్మహత్య

|

Nov 14, 2021 | 10:05 AM

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంది. వివాహం నిశ్చయమైన యువతి ఇంకా పెళ్లి పీటలు ఎక్కనేలేదు. అప్పుడే ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి.

Crime News: పెళ్లి కాకముందే కాబోయే భర్త వేధింపులు.. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి వచ్చిన యువతి ఆత్మహత్య
Suicide
Follow us on

Karnataka Young Woman Suicide: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంది. వివాహం నిశ్చయమైన యువతి ఇంకా పెళ్లి పీటలు ఎక్కనేలేదు. అప్పుడే ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. కాబోయే భర్త అనుమానంగా చూడటం మొదలు పెట్టాడు. ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

హుబ్లీ ప్రశాంత్‌నగర్‌‌కు చెందిన పవిత్ర పాటిల్‌కు హావేరి చెందిన అభినందన్‌తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 2న వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు. ఈక్రమంలో పవిత్రను అభినందన్‌ దాండేలికి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం తీసుకెళ్లాడు. అప్పటినుంచి ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ వేధించసాగాడు. దీంతో పవిత్ర కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. అయితే, పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయని తల్లిదండ్రులు ఓదార్చారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పవిత్ర శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అశోక్‌నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అభినందన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also…  Tips for Cold Relief: చలికాలంలో జలుబు సమస్య వేధిస్తోంది.. అయితే 5 సూచనలు తప్పక పాటించండి..