
Woman Suicide: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం (Prakasam) జిల్లాలోని కంభంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని వేధింపులకు గురి చేస్తున్నాడని దూదేకుల భాను అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తరఫు బంధువులు తనపై దాడి చేశారని సూసైడ్ (Suicide) వీడియోలో ఆ మహిళ వెల్లడించింది. తాను ఎవరినీ ఆశ్రయించినా.. న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదు అంటూ సెల్ఫీ వీడియోలో భాను పేర్కొంది. దీంతో గత్యంతరం లేక తాను ఆత్మహత్య (Woman Suicide) కు పాల్పడుతున్నట్లు వీడియోలో వివరాలు తెలిపి బలవన్మరణానికి పాల్పడింది.
ప్రకాశం జిల్లా (Prakasam District) అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన దూదేకుల భానుకు కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన నాగూర్ అనే వ్యక్తికి 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో నాగూర్ అక్రమ సంబంధం పెట్టుకొని తరచు భార్యను వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగూర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: