Woman Murdered: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో మహిళ దారుణ హత్య.. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం

Woman Murdered: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని ఎన్‌ఎండీసీ సర్కిల్‌ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు...

  • Subhash Goud
  • Publish Date - 1:24 am, Sat, 9 January 21
Woman Murdered: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో మహిళ దారుణ హత్య.. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం

Woman Murdered: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని ఎన్‌ఎండీసీ సర్కిల్‌ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

ఆమె వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళను నిన్నరాత్రి హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..బైక్‌ను ఢీకొన్న కారు.. తల్లీకొడుకు దుర్మరణం