కూతురిని సజీదహనం చేసిన కసాయి తండ్రి.. ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కక్ష.. సుపారీ హంతకుడితో అమానుషం.!

|

Feb 16, 2021 | 6:35 PM

Woman Burnt Alive: వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురిని కిరాతకంగా కడతేర్చాడు ఓ తండ్రి. ఈ దారుణానికి అతడి కొడుకు...

కూతురిని సజీదహనం చేసిన కసాయి తండ్రి.. ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కక్ష.. సుపారీ హంతకుడితో అమానుషం.!
Fire Accident
Follow us on

Woman Burnt Alive: వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురిని కిరాతకంగా కడతేర్చాడు ఓ తండ్రి. ఈ దారుణానికి అతడి కొడుకు, అల్లుడు కూడా సహకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని జగినా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

జగినా గ్రామానికి చెందిన కైలాష్ యాదవ్ తన కూతురు కంటే పరువే ముఖ్యమని భావించాడు. కుమార్తె వేరే మతస్ధుడిని ప్రేమించిందని తెలిసి ఆమె హత్యకు పధకం పన్నాడు. అతడికి కుమారుడు అజిత్ యాదవ్, అల్లుడు సత్యప్రకాష్ యాదవ్‌తో మరో వ్యక్తి సీతారామ్ యాదవ్ కూడా సహకరించారు. మహులీకి చెందిన ఓ కిరాయి హంతకుడు వరుణ్ తివారీకి రూ. 1.5 లక్షలు సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు బాధితురాలిని జగినా గ్రామంలోని మారుమూల ప్రాంతానికి ద్విచక్రవాహనంపై తీసుకురాగా.. మరో నిందితుడు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి సజీవ దహనం చేశాడు.

ఈ దారుణం ఘటన ఫిబ్రవరి 3వ తేదీన జరగగా.. పోలీసులకు సగం కాలిన ఓ యువతి మృతదేహం ఈ నెల 4వ తేదీన లభ్యమైంది. ఘటనాస్థలంలో బైక్‌తో పాటు, పెట్రోల్​ క్యాన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ, స్థానిక పోలీసుల సహాయంతో బాధితురాలు రంజనా యాదవ్‌గా గుర్తించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. హత్య చేసింది తామేనని రంజనా కుటుంబీకులు ఒప్పుకున్నారు. వేరే మతస్థుడిని ప్రేమించిదన్న కారణంతో కిరాయి హంతకుడి చేత హత్య చేయించామని పేర్కొన్నారు. కాగా, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సుపారీ హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!