Woman boyfriend kills husband: ఓ మహిళ ప్రియుడితో కలిసి ఉండాలనుకుంది.. ఈ క్రమంలో భర్తను చంపేందుకు ప్రియుడు, తనచెల్లితో కలిసి ప్లాన్ వేసింది. ఆపై ఇంట్లోనే దారుణంగా చంపింది. మళ్లీ ఎక్కడ దొరికిపోతామేమోనన్న భయంతో.. ప్రియుడితో కలిసి భర్త శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కెమికల్‌లో వేసి శరీరాన్ని కనిపించకుండా మాయం చేయాలనుకున్నారు. ఇలా సాక్ష్యాలను కనుమరుగుచేస్తున్న క్రమంలో.. వాళ్లు తీసుకువచ్చిన రసాయనాలు ఒక్కసారిగా విస్ఫోటనం చెందాయి. చివరకు శబ్ధం వచ్చి మంటలు చెలరేగడంతో.. సీన్ రివర్స్ అయి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పూర్‌లోని సికందర్‌పూర్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రాధ అనే వివాహిత తన ప్రియుడు సుభాష్, సోదరి కృష్ణ దంపతులతో కలిసి తన భర్త రాకేష్ (30) ను హతమార్చింది. అనంతరం భర్త మృతదేహాన్ని వదిలించుకోవడానికి రాధ.. ప్రియుడితో కలిసి ముక్కలుగా ముక్కలుగా నరికించింది. ఆ తర్వాత ముక్కలను కెమికల్‌లో వేసి కరిగించేందుకు ప్రయత్నించింది. కెమికల్ వాడకంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. ఫ్లాట్ లోపల చెల్లాచెదురుగా ఉన్న మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి పంపారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం దీనిపై దర్యాప్తు ప్రారంభించగా.. మృతదేహం రాధ భర్త రాకేశ్ దిగా గుర్తించారు. బీహార్ రాకేశ్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడని, పోలీసుల భయంతో అతను ఇంటికి రావడం లేదని తేలింది.
దీంతో అతని భాగస్వామి సుభాష్.. రాకేశ్ భార్య దగ్గరయ్యాడని.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు చెప్పారు. తీజ్ సందర్భంగా భర్త రాకేశ్ ను ఇంటికి పిలిచిన భార్య రాధ ప్రియుడు, చెల్లెలు సహాయంతో దారుణంగా చంపిందని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు దినేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
KIA Factory: అనంతపురం కియా ఫ్యాక్టరీలో టెన్షన్.. ఇనుప రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు..
Viral Video: ఫ్రెండ్‌షిప్ అంటే ఈ గుర్రం, మేకలదే గురూ.. మనుషులు సైతం కుళ్లుకునేలా.. వీడియో వైరల్