అనుమానం, ఆవేశం కలబోసి.. భర్తపై యాసిడ్‌ దాడి చేసిన భార్య, కళ్లకు తీవ్రగాయాలతో

సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది.  భర్తపై భార్య యాసిడ్‌  దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..

  • Ram Naramaneni
  • Publish Date - 10:38 am, Sat, 28 November 20
అనుమానం, ఆవేశం కలబోసి..  భర్తపై యాసిడ్‌ దాడి చేసిన భార్య, కళ్లకు తీవ్రగాయాలతో

సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది.  భర్తపై భార్య యాసిడ్‌  దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. కోదాడ శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న లక్ష్మి ఎప్పుడూ భర్త నర్సింహరావుపై అనుమానపడుతూ ఉండేది. మరో మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఉండేది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుసార్లు గొడవలు జరిగాయి. తాజాగా శనివారం ఉదయం మరోసారి ఘర్షణ జరిగింది. ఆవేశంలో లక్ష్మి, శ్రీనివాస్‌పై యాసిడ్ దాడి చేసింది. బాధితుడిని స్థానికులు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భర్తపై యాసిడ్‌ పోసిన భార్య

Also Read :

హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు.. ముగ్గురు దుర్మరణం

 శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?