జార్ఖండ్ (Jharkhand) లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. వారిద్దరిని పట్టుకుని నిప్పంటించారు. చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జార్ఖండ్ లోని గుమ్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిప్పు పెట్టిన ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వివరాలేమీ తెలియలేదని, చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి