విశ్వహిందూ పరిషత్ చెందిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అక్టోబర్ 27న రాత్రి వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు అమిత్ గుప్తా నివాసం వద్ద దుండగులు కారుకు నిప్పంటించి సైలెంట్‌గా ఎస్కేప్ అయ్యారు. న్యూ మండి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ హరీష్ భడోరియా వెల్లడించారు. కాగా ఈ ఘటనపై హిందూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.