ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఆ అపురూప దృశ్యాలను చూసేందుకు వచ్చారు. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను కబళించింది. అనంతపురం (Anantapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెలుగుప్ప మండలం కాల్వపల్లి వద్ద పెన్నా నది వంతెనపై వేగంగా వచ్చిన లారీ మహిళలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పేరూరు ప్రాజెక్టు (Peruru Dam) గేట్లు ఎత్తడంతో పెన్నా నదిలోకి భారీగా వరద వస్తోంది. నీటిని చూసేందుకు వెళ్లిన మహిళలపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన లారీని పట్టుకునేందుకు గ్రామస్థులు శ్రమించి, చివరకు బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారుర. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాజెక్టు చూసేందుకు వచ్చిన ఇద్దరు మహిళలు చనిపోవడంతో.. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..