Two Children Missing: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు బాలురు మిస్సింగ్.. ఆడుకోవడానికి బయటికి వెళ్లిన పిల్లలు..

Two Children Missing: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది.

Two Children Missing: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు బాలురు మిస్సింగ్.. ఆడుకోవడానికి బయటికి వెళ్లిన పిల్లలు..

Updated on: Jan 10, 2021 | 11:43 AM

Two Children Missing: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా బయటకు వెళ్లిన పిల్లలు కనిపించకపోవడంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలాయగూడెనికి చెందిన ఇద్దరు బాలురు స్థానికంగా ఆరోతరగతి చదువుతున్నారు. వీరిద్దరు అన్నదమ్ముల పిల్లలు. యశ్వంత్ తండ్రి సురేష్, అభి తండ్రి అగస్తిన్ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి శత్రువులు ఎవరూ లేరు. అయితే ఇద్దరు పిల్లలు శనివారం సాయంత్రం ఆడుకోవడానికి సైకిల్ తీసుకొని బయటికి వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పరిసరాలు మొత్తం గాలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కంగారు పడుతూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

అర్థం చేసుకునే కోచ్‌లుంటే అంతా శుభపరిణామమే.. విజేతలు కావాలంటే మంచి కోచ్ తప్పనిసరి అంటున్న బ్యాడ్మింటన్ స్టార్..