Bike Robber On Highway : వాహనదారులపై దాడి చేసి.. గాయపరచి దోచుకున్న ఓ ట్రాన్స్ జెండర్స్ బృందం..

|

Mar 06, 2021 | 11:32 AM

నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు స్నేహితులపై ఓ ట్రాన్స్ జెండర్స్ దారి దోపిడి బృందం ఎటాక్ చేసింది. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..

Bike Robber On Highway : వాహనదారులపై దాడి చేసి.. గాయపరచి దోచుకున్న ఓ ట్రాన్స్ జెండర్స్ బృందం..
Follow us on

Bike Robber On Highway : నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు స్నేహితులపై ఓ ట్రాన్స్ జెండర్స్ దారి దోపిడి బృందం ఎటాక్ చేసింది. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని చిత్ర దుర్గ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

చిత్రదుర్గ లో పోస్టల్ ఉద్యోగులైన అనిల్, శంబులింగప్ప గురువారం సాయంత్రం యల్గోడు గ్రామంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి సాయంత్రం విందు ముగించుకుని తిరిగి వస్తున్నారు. కాత్రల్ సరస్సు సమీపంలో వీరి బైక్ ను దారిదోపిడి దొంగలు అడ్డగించారు. దీంతో అనిల్, శంబులింగప్ప బైక్ మీదనుంచి కిందకు పడ్డారు. దీంతో వీరిద్దరిపై చెప్పులతో , రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం తుపాకీతో బెదిరించి వారివద్దనున్న గోల్డ్ చైన్, రింగ్, డబ్బులు తీసుకుని అక్కడనుంచి పారిపోయారు. అయితే ఈ దారుణనికి పాల్పడింది ఆటో-కాటన్ మసాన్ల ముఠాగా తెలుస్తోంది.

బాధితులిద్దరు ఈ విషయంపై సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం స్తానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్తానికులు ఈ విషయంపై స్పందిస్తూ.. రోజు రోజుకీ ఈ ట్రాన్స్ జెండర్స్ ముఠాలుగా ఏర్పడి.. దారుణంగా ప్రవర్తిస్తున్నారని.. దారి కాచి దోపిడీలు చేస్తున్నారని.. చెప్పారు. అందుకనే తమకు రాత్రి అయితే హైవే పై ప్రయాణం చేయాలంటే భయం వేస్తుందని స్తానికులు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు చిత్రదుర్గ నగర రహదారులపై ట్రాన్స్ జెండర్ ఆగడాల సంఖ్య పెరుగుతోంది. ఇది వరకూ డబ్బుల కోసం హించేవారు ఇప్పుడు ఏకంగా దాడులు చేస్తూ.. విలువైన వస్తువులు దోచుకుంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని రాత్రి సమయంలో ప్రయాణించే వారికీ రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Also Read :

AP SEC: వాలంటీర్లతో ఎన్నికల పనులు చేయించొద్దు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ

Karthika Deepam Serial : ఓ వైపు అంజి..ని మోనిత ఇంటికి తీసుకెళ్తున్న కార్తీక్.. మరోవైపు ఊరుదాటుతున్న దీప