Girl Death: విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న బీరువా.. పాఠశాలలో బాలిక దుర్మరణం..

Medchal–Malkajgiri district: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి వెంట వచ్చిన కుమార్తెపై ప్రమాదవశాత్తు బీరువా పడి.. ఎనిమిదేళ్ల

Girl Death: విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న బీరువా.. పాఠశాలలో బాలిక దుర్మరణం..
Girl Death

Updated on: Aug 10, 2021 | 8:13 AM

Medchal–Malkajgiri district: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి వెంట వచ్చిన కుమార్తెపై ప్రమాదవశాత్తు బీరువా పడి.. ఎనిమిదేళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బోడుప్పల్‌ దేవేందర్‌నగర్‌కాలనీలో నివసించే కుంచాల మధు, లత దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే.. లత స్థానిక సిద్ధార్థ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాఠశాలలో పని నిమిత్తం లత కుమార్తె కీర్తి (8) తో కలిసి వచ్చింది.

అనంతరం పాఠశాలలో బీరువాలు శుభ్రంచేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ బీరువా చిన్నారి కీర్తిపై పడింది. వెంటనే తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పరిశీలించి.. పలు వివరాలు సేకరించారు.

అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పాఠశాల యాజమాన్యం తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

Also Read:

EX-Servicemen : మాజీ సైనికులకు, అధికారులకు పెన్షన్ ఎలా నిర్ణయిస్తారు..! ప్రతి సంవత్సరం ఎంత కేటాయిస్తారు..?

Chilli Powder Bath: గ్రామస్థుల కోసం.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 108 కేజీల కారంతో స్నానం చేసిన పూజారి ఎక్కడంటే