విషాదం: అత్త మరణవార్త విని కుప్పకూలిన కోడలు

|

Sep 27, 2020 | 4:58 PM

అత్త మరణవార్త విన్న ఓ కోడలు కుప్పకూలింది..అనంతలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు మృతిచెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

విషాదం: అత్త మరణవార్త విని కుప్పకూలిన కోడలు
Follow us on

అనంతలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు మృతిచెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా అమడగూరు మండలం కస్సముద్రం గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ అనే  మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆమెకు బీపీ లెవల్స్ పెరగడంతో హుటాహుటినా కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది. దీంతో అత్త మృతదేహాన్ని చూసి కోడలు మణేమ్మ కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఏడు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్‌తో వెంకటరమణమ్మ భర్త ఆంజనేయులు మృతిచెందాడు. కాగా, రెండేళ్ల క్రితం మణేమ్మ భర్త కూడా మరణించాడు. ప్రస్తుతం ఒకే రోజున అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకేరోజు మరణించటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.