Human Skeletons Found : కుప్పలు తెప్పలుగా కీటకాలు.. ఏంటా అని చూస్తే మూడు అస్తి పంజరాలు.. ఆరాతీస్తే షాకింగ్..

Human Skeletons Found : హర్యానాలోని పానిపట్ శివనగర్ కాలనీలో ఓ ఇంట్లో పునర్ నిర్మాణ పనులు జరిగేటప్పుడు మూడు అస్థి పంజరాలను గుర్తించారు.

Human Skeletons Found : కుప్పలు తెప్పలుగా కీటకాలు.. ఏంటా అని చూస్తే మూడు అస్తి పంజరాలు.. ఆరాతీస్తే షాకింగ్..
Human Skeletons Found

Updated on: Mar 24, 2021 | 11:48 AM

Human Skeletons Found : హర్యానాలోని పానిపట్ శివనగర్ కాలనీలో ఓ ఇంట్లో పునర్ నిర్మాణ పనులు జరిగేటప్పుడు మూడు అస్థి పంజరాలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికాస్ కుమార్ అనే వ్యక్తి రెండున్నర సంవత్సరాల క్రితం ఒక పాత ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి సంబంధించి కొంతభాగం రోడ్డుపై ఉండటంతో దానిని తీసివేసి పునర్నిర్మించాలని మరమ్మతు పనులను చేపట్టాడు.

అయితే మరమ్మతు పనులు చేసేటప్పుడు ఇంట్లోని ఒక మూల నుంచి కీటకాలు కుప్పలు కుప్పలుగా బయటికి వస్తున్నాయి. అయితే వాటిని చూసి కొంతకాలం ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిర్మాణంలో భాగంగా తవ్వకాలు చేస్తు్న్నప్పుడు కీటకాలను చూసిన వ్యక్తులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని భావించారు. అవి బయటికి వస్తున్న స్థలం దగ్గర తవ్వేసరికి అక్కడ మూడు మానవ అస్తి పంజరాలను కనుగొన్నారు. వెంటనే భయబ్రాంతులకు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

అందులో భాగంగా ఇంటి యజమాని కుమార్‌ని ప్రశ్నించగా తాను రెండున్నర సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కొన్నానని అంతకు ముందు ఈ ఇంటిని మరో ఇద్దరు కొనుగోలు చేశారని అంతకు మించి తనకు ఏ విషయాలు తెలియదని చెప్పాడు. అస్తిపంజరాల విషయం బయటపడటంతో స్థానికంగా జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Love Story Movie : నాగచైతన్య- సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’కి సూపర్ స్టార్ సపోర్ట్ .. మహేష్ చేతులమీదుగా..

Bank Holidays in April 2021 : బ్యాంక్ వినియోగదారులు బీ అలర్ట్.. ఏప్రిల్ లో ఎన్నో రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా..?

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు, ప్రధాని మోదీ ఆకాంక్ష, ఇమ్రాన్ కి గ్రీటింగ్స్