క్లాస్ లీడర్ కోసం పోటీ..అమ్మాయి చేతిలో ఓటమి..ఆపై ఆత్మహత్య

| Edited By:

Jul 20, 2019 | 12:55 PM

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయి చరణ్‌ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివర్లాలోకి వెళ్తే.. సాయి చరణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత బుధవారం (జులై 16) ఆ పాఠశాలలో క్లాస్ లీడర్‌ కోసం పోటీలు నిర్వహించారు. లీడర్‌గా పోటీచేసిన చరణ్‌ ఓటమి పాలయ్యాడు. అది ఓ అమ్మాయిపై ఓడిపోవడంతో […]

క్లాస్ లీడర్ కోసం పోటీ..అమ్మాయి చేతిలో ఓటమి..ఆపై ఆత్మహత్య
Follow us on

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయి చరణ్‌ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివర్లాలోకి వెళ్తే.. సాయి చరణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత బుధవారం (జులై 16) ఆ పాఠశాలలో క్లాస్ లీడర్‌ కోసం పోటీలు నిర్వహించారు. లీడర్‌గా పోటీచేసిన చరణ్‌ ఓటమి పాలయ్యాడు. అది ఓ అమ్మాయిపై ఓడిపోవడంతో అతను ప్రెండ్స్ ముందు నామోషీ ఫీల్ అయ్యాడు.

గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిన విధ్యార్థి… సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన తల్లిదండ్రులకు చేదు వార్త తెలిసింది. రైలు పట్టాలపై చరణ్ విగతజీవిగా కన్పించాడు.  అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి మృతదేహాన్ని చూసి చరణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చరణ్ మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.