దారుణం:పెట్రోల్ పోసి.. ఆఫీసులోనే హత్య.. తహశీల్దార్ సజీవ దహనం

హైదరాబాద్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ ఆఫీసులో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయానికి వచ్చిన ఓ దుండగుడు తహశీల్దార్ విజయా రెడ్డి పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తరువాత తనపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ప్రమాదంలో విజయ సజీవ దహనం అవ్వగా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఉస్మానియా మార్చురీకి తహశీల్దార్ మృతదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 1.20గంటలకు తహశీల్దారు ఆఫీసులోకి చొరబడ్డ హంతకుడు అరగంటపాటు ఆమె రూమ్‌లో ఉన్నాడు. మాట్లాడుతూ.. మాట్లాడుతూనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏం […]

దారుణం:పెట్రోల్ పోసి.. ఆఫీసులోనే హత్య.. తహశీల్దార్ సజీవ దహనం

Updated on: Nov 04, 2019 | 4:45 PM

హైదరాబాద్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ ఆఫీసులో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయానికి వచ్చిన ఓ దుండగుడు తహశీల్దార్ విజయా రెడ్డి పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తరువాత తనపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ప్రమాదంలో విజయ సజీవ దహనం అవ్వగా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఉస్మానియా మార్చురీకి తహశీల్దార్ మృతదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 1.20గంటలకు తహశీల్దారు ఆఫీసులోకి చొరబడ్డ హంతకుడు అరగంటపాటు ఆమె రూమ్‌లో ఉన్నాడు. మాట్లాడుతూ.. మాట్లాడుతూనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతోందో తెలీక విజయ ఆఫీసులో హాహాకారాలు పెట్టింది. విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. హంతకుడికి హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా గుర్తించారు. అయితే భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్‌బుక్ సరిదిద్దాలని కొంతకాలంగా సురేష్ ఆఫీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయా రెడ్డి స్వగ్రామం శాలిగౌరరం మండలం పెరకకొండారం. ఇదిలా ఉంటే ఆమె మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించుకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై సీఎంవో కార్యాలయ అధికారులు ఆరా తీశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us