Latest Crime News: మహిళపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. తన మాట వినకుంటే పిల్లల చదువులు నాశనం చేస్తానని..

Latest Crime News: విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే ప్రభుత్వం ఉపాధ్యాయుడే పెడదోవ పడుతున్నాడు. ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించి

Latest Crime News: మహిళపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. తన మాట వినకుంటే పిల్లల చదువులు నాశనం చేస్తానని..

Updated on: Jan 11, 2021 | 9:31 AM

Latest Crime News: విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే ప్రభుత్వం ఉపాధ్యాయుడే పెడదోవ పడుతున్నాడు. ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలు విక్రయిస్తుంటుంది.

ఇదే క్రమంలో ఆమె తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ఆమె పైట చెంగు పట్టుకుని అసభ్యకంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆగ్రహంతో ఇంటికి వెళ్లిపోతుంటే అతడు ఆమెను అనుసరించడమే కాకుండా ఆమె ఇంటికి వెళ్లి మరీ అసభ్యంగా ప్రవర్తించాడు. ‘నీ పిల్లలకు చదువు చెబుతా. కోర్కె తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా. నన్నే వద్దంటావా? అని ఆమెతో ఘర్షణ పడి అడ్డు వచ్చిన ఆమె తల్లిదండ్రులను కొట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బెల్లంకొండ క్రాస్‌ రోడ్డు వద్ద ఆ ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించి, బాధితురాలికి న్యాయం చేయాలని ధర్నా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులో దారుణం.. మహిళపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక లైంగికదాడి