నకిలీ వర్సిటీ పేరుతో డాక్టరేట్ల దందా..

|

Sep 27, 2020 | 6:02 PM

నకిలీ వర్సిటీ అసలు భాగోతం బయటపడింది. ఈ నకిలీ వ్యలవహారానికి కారకులైన ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టాలలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ వర్సిటీ పేరుతో డాక్టరేట్ల దందా..
Follow us on

తమిళనాడులో నకిలీ డాక్టరేట్ల చెక్ పెట్టారు పోలీసులు. నకిలీ యూనివర్సిటీ పట్టాలతో అమాయకపు ప్రజల జీవితాలతో ఆడలాడుతున్న నకిలీ వర్సిటీ గుట్టురట్టు చేశారు. కాసేపట్లో డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నవారికి నకిలీ వర్సిటీ అసలు భాగోతం బయటపడింది. ఈ నకిలీ వ్యవహారానికి కారకులైన ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ పేరుతో నకిలీ వర్సిటీ తెరిచారు. ఎలాంటి అనుమతులు లేకుండా వర్సిటీ పేరుతో డాక్టరేట్ పట్టాలను అమ్మకుంటున్నారు. పక్కా సమాచారంతో వర్సిటీ పేరుతో నకిలీ దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్‌లో ఓ హోటల్‌పై దాడిచేశారు.142 మంది ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి నంబియార్, శ్రీనివాస్ తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.