Sunny Leone: సన్నీలియోన్‌పై కేసు నమోదు.. విచారించిన కేరళ పోలీసులు.. కారణాలు ఇలా..

Sunny Leone: బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీని కేరళ పోలీసులు విచారించారు. ఆర్థికనేరానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్‌

Sunny Leone: సన్నీలియోన్‌పై కేసు నమోదు.. విచారించిన కేరళ పోలీసులు.. కారణాలు ఇలా..

Updated on: Feb 07, 2021 | 8:19 AM

Sunny Leone: బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీని కేరళ పోలీసులు విచారించారు. ఆర్థికనేరానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనని నమ్మించి రూ.29 లక్షలు సన్నీ అక్రమంగా తీసుకున్నారంటూ పెరంబవూర్‌కు చెందిన ఆర్‌.షియాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణ చేపట్టిన పోలీసులు సన్నీని విచారించారు. ఓ టెలివిజన్‌ షో నిమిత్తంగా తిరువనంతపురం జిల్లా పూవురుకు వచ్చిన ఆమెను ప్రశ్నించారు. రెండు కార్యక్రమాల్లో సన్నీ పాల్గొంటానని చెప్పి తన నుంచి రూ.29లక్షలు తీసుకుని ఆ తర్వాత మొహం చాటేశారని షియాస్‌ ఆరోపించాడు. దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు.

INDIA VS ENGLAND: సిక్సర్‌తో డబుల్ సెంచరీ కంప్లీట్ చేయడం హైలెట్.. సారథిని పొగడ్తలతో ముంచెత్తిన..