పరీక్షకు వెళ్తూ ఇంటర్ విద్యార్థి మృతి

|

Mar 17, 2020 | 11:58 AM

ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కామేపల్లి మండలం పొన్నెకల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి...

పరీక్షకు వెళ్తూ ఇంటర్ విద్యార్థి మృతి
Follow us on

ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కామేపల్లి మండలం పొన్నెకల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా బైక్ పైనుంచి కింది పడి విద్యార్థి చనిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంటర్‌ పరీక్ష రాసేందుకు ఇద్దరు విద్యార్థులు కలిసి బైక్‌పై వెళ్తున్నారు. వేగంగా వెళ్తుండడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడు డోర్నకల్‌కు చెందిన వివేక్‌గా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి:తల్లీ, కొడుకు సజీవదహనం !