Murder: అత్తా, కోడళ్ల మధ్య గొడవ.. కన్న తల్లిని గొడ్డలితో నరికిన కుమారుడు..

|

Apr 17, 2021 | 9:07 AM

Son Kills his Mother: కన్నతల్లినే కొడుకు కిరాతకంగా కడతేర్చాడు. అత్తా కోడళ్ల మద్య వివాదం నేపథ్యంలో.. ఆగ్రహావేశంతో ఊగిపోయిన కుమారుడు తాగిన మైకంలో కన్న తల్లినే అత్యంత దారుణంగా

Murder: అత్తా, కోడళ్ల మధ్య గొడవ.. కన్న తల్లిని గొడ్డలితో నరికిన కుమారుడు..
Murder
Follow us on

Son Kills his Mother: కన్నతల్లినే కొడుకు కిరాతకంగా కడతేర్చాడు. అత్తా కోడళ్ల మద్య వివాదం నేపథ్యంలో.. ఆగ్రహావేశంతో ఊగిపోయిన కుమారుడు తాగిన మైకంలో కన్న తల్లినే అత్యంత దారుణంగా హతమర్చాడు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం పొలికెపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన మంకలి నర్సయ్య, కాశమ్మ దంపతులకు కురుమయ్య, శివ కుమారులున్నారు. శివ జేసీబీ డ్రైవర్, ఆయనకు ఎనిమిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రేణుకతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల అత్త కాశమ్మ (55) కు, కోడలు రేణుక మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవ కాస్త.. తారస్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో మనస్తాపం చెందిన కాశమ్మ ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది. ఇది గమనించి కోడలు రేణుక అత్త చేసే ప్రయత్నాన్ని నిలువరించింది. ఈ తరుణంలో మద్యం మైకంలో ఉన్న శివ ఆవేశానికి లోనై ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని తల్లి కాశమ్మ మెడపై నరికాడు. దీంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందింది.

సమాచారం అందుకున్న ఎస్ఐ రామన్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శివ, ఆయన భార్య రేణుకను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌, సీఐ సందర్శించి పలువ వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Corona Effect: మరీ ఇంత దారుణమా?.. కరోనా సోకిన మహిళనూ వదలని కీచకుడు.. విసిగిపోయిన మహిళ చివరికి ఏం చేసిందంటే..

Karnataka CD Case: కర్ణాటక రాసలీల కేసులో మరో మలుపు… కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు..