కోడలు కారం చల్లింది..కొడుకు రాడ్డుతో చితకబాదాడు

తిరుపతి: సమాజంలో మానవత్వం అంతరించిపోతోంది. బందుత్వాలు, బాందవ్యాలు కూడా మరిచి మనుషులు పశువులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన సమాజంలో విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి అర్థం పడుతుంది. వయసు మీద పడిన తండ్రిపై  కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని అనంత వీధిలో నివసించే 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య దంపతులపై పెద్ద కొడుకు విజయ్‌ తన భార్య, బావమర్దితో కలిసి దాడి చేశాడు. […]

కోడలు కారం చల్లింది..కొడుకు రాడ్డుతో చితకబాదాడు

Edited By:

Updated on: Jun 04, 2019 | 4:56 PM

తిరుపతి: సమాజంలో మానవత్వం అంతరించిపోతోంది. బందుత్వాలు, బాందవ్యాలు కూడా మరిచి మనుషులు పశువులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన సమాజంలో విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి అర్థం పడుతుంది. వయసు మీద పడిన తండ్రిపై  కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని అనంత వీధిలో నివసించే 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య దంపతులపై పెద్ద కొడుకు విజయ్‌ తన భార్య, బావమర్దితో కలిసి దాడి చేశాడు. తమకున్న రెండు సెంట్ల స్థలాన్ని మందుల కోసం, చేతి ఖర్చుల కోసం, వయసు సహకరించక చేసిన అప్పుల కోసం మునికృష్ణయ్య అమ్మాలనుకోవడమే  కొడుకు కోపానికి కారణమైంది. ముందుగా కోడలు కళ్లలో కారం చల్లగా విచక్షణ కోల్పోయిన కొడుకు ఇనుప రాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. బావమరిది సైతం అతడికి సహకరించారు. వృద్దుడి పట్ల కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన తీరు స్థానికుల్ని విస్మయానికి  గురిచేసింది. ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us