హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. భార్యా, భర్తల మధ్య వచ్చిన గొడవలే కారణమంటున్న స్థానికులు..

|

Nov 30, 2020 | 10:38 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఎవ్వారం ఎవరికీ అర్థం కానిది. ఉన్నత ఉద్యోగం, ఐదెంకల జీతం ఉన్నామానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. భార్యా, భర్తల మధ్య వచ్చిన గొడవలే కారణమంటున్న స్థానికులు..
Follow us on

Software employee suicide:సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఎవ్వారం ఎవరికీ అర్థం కానిది. ఉన్నత ఉద్యోగం, ఐదెంకల జీతం ఉన్నామానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మియాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గోపాల్‌నగర్‌కు చెందిన స్రవంతి అనే మహిళ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. అయితే భార్య, భర్తల మధ్య వచ్చిన గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్రవంతి భర్త రవికిరణ్ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కనుక ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొన్నిరోజులు అన్యోన్యంగా ఉన్నఈ దంపతులు ఏ విషయమై వీరికి గొడవ జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన స్రవంతి ఉరేసుకొని మృతిచెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.