ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం.. ఇంటి ముందు నిల్చున్న బాలికను లాక్కెళ్లి అఘాయిత్యం..!

|

Feb 22, 2021 | 2:08 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు నిల్చుకున్న బాలికను లాక్కెళ్లిన దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం.. ఇంటి ముందు నిల్చున్న బాలికను లాక్కెళ్లి అఘాయిత్యం..!
Follow us on

Girl allegedly raped :  రాను రానూ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు నిల్చుకున్న బాలికను లాక్కెళ్లిన దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహోబాలో చోటుచేసుకుంది.

మహోబాలోని తన ఇంటి ముందు రాత్రి సమయంలో పదహారేళ్ల బాలిక నిలబడి ఉంది. బాలికను గమనించిన ఇద్దరు యువకులు ఆమె ఇంటి ముందు నుంచే అపహారించుకు వెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అదే ప్రాంతానికి చెందిన జైహింద్ (23), ఆషిష్ సేన్(22)లు వచ్చి బలవంతంగా ఆమెను పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. జరిగిన దారుణానికి సంబంధించి బాధిత బాలిక తన అక్కకు చెప్పింది. దీంతో స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితులైన జైహింద్, ఆషిష్ సేన్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండిః  Video: మంటగలిసిన మానవత్వం.. ఏనుగుపై మావటివాళ్ల అమానుషం.. అరుస్తున్నా.. కొడుతూనే..!