పులి చర్మం విక్రయ ముఠా అరెస్ట్

|

Oct 29, 2020 | 7:00 PM

మంచిర్యాల జిల్లాలో చిరుత పులి చర్మం విక్రయం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలో హత్యకు గురైన చిరుత పులి చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు‌.

పులి చర్మం విక్రయ ముఠా అరెస్ట్
Follow us on

మంచిర్యాల జిల్లాలో చిరుత పులి చర్మం విక్రయం కలకలం రేపింది. తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో హత్యకు గురైన చిరుత పులి చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు‌. చిరుత పులి చర్మం కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా ముగ్గురు నిందితులు పరారయ్యారు. నిందితుల వద్ద నుండి చిరుత పులి చర్మం, ఒక బైక్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా మంగి అటవీ ప్రాంతం లో చోటు చేసుకోగా.. చిరుత పులి ని చంపి, దాని చర్మాన్ని ఒలిచి మంచిర్యాల జిల్లా మందమర్రి రూరల్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండు గూడ గ్రామంలో అమ్మకానికి ఉంచిన సమయంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు గోపతి వంశీ , సిక్రం గంగు, జూపాక దుర్గ ప్రసాద్, షేక్ జమీల్ , మహమ్మద్ వాజిధ్ ఖాన్, ఆవుల సాయి క్రిష్ణ గా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.