Road accident: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ద్విచ‌క్ర వాహ‌నంపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్ద‌రు మృతి

|

Dec 26, 2020 | 1:34 PM

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డం కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి....

Road accident: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ద్విచ‌క్ర వాహ‌నంపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్ద‌రు మృతి
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డం కార‌ణాల వల్ల రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల‌ను నివారించేందుకు పోలీసు ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టినా.. ప్ర‌మాదాలు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం డివైడ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో వారి నుంచి లారీ దూసుకెళ్లగా ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. జిల్లాలోని కొండపాక మండలం ఆరేపల్లి రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌మాద‌వ‌శాత్తు డివైడ‌ర్‌ను ఢీకొట్టి కింద ప‌డిపోయారు. దీంతో వేగంగా వ‌స్తున్న ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన సాగర్, రమేష్ లుగా గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.