ఓల్డ్ సిటీలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

|

Sep 17, 2020 | 8:30 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీలో సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం అందింది.

ఓల్డ్ సిటీలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు
Follow us on

హైదరాబాద్‌లోని పాతబస్తీలో సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ గృహంపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మిస్కిన్, తరన్నుమ్ అనే భార్యాభర్తలు గత కొన్ని రోజుల నుంచి ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధిత యువతుల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్, ఒకరు కర్ణాటక, మిగతా వారు పాతబస్తీ వారని వెల్లడించారు. ఈ సెక్స్ రాకెట్ నిర్వహకులు, విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. బాధిత మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిర్వహకుల నుంచి రూ.32 వేల నగదు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.