Hyderabad: ప్రయాణికులపై దౌర్జన్యం.. ఏడుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్.. ఎక్కడంటే..?

| Edited By: Team Veegam

Apr 20, 2021 | 12:14 PM

Transgenders Arrest: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్రాల ఆగడాలు మితిమిరుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకొని

Hyderabad: ప్రయాణికులపై దౌర్జన్యం.. ఏడుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్.. ఎక్కడంటే..?
transgenders arrest
Follow us on

Transgenders Arrest: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్రాల ఆగడాలు మితిమిరుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకొని భయపెడుతూ డబ్బులు డిమాండ్‌ చేయడంతోపాటు.. జేబుల్లో ఎంత ఉంటే.. అంత లాక్కెళుతున్నారు. ఇలానే అడ్డుకొని డబ్బులు లాక్కెళ్లిన ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన మహ్మద్‌ రహీం వృత్తి రీత్యా డ్రైవర్‌. 18వ తేదీన జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఇందిరానగర్‌ వైపు ఆటోలో వెళ్తుండగా.. కొందరు ట్రాన్స్‌జెండర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రహి మాట్లాడుతుండగానే.. అతని జేబులో నుంచి వెయ్యి రూపాయలు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇచ్చేయాలని రహీం కోరగా దుర్భాషలాడుతూ భయపెట్టారు. దీంతో రహీం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా.. గతంలో ఇలాంటి ఫిర్యాదులు చాలా రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు పలు చోట్ల చర్యలు కూడా తీసుకుంటున్నారు. రహీం ఫిర్యాదు మేరకు.. అతని నుంచి డబ్బులు లాక్కున్న ఇందిరానగర్‌కు చెందిన ఏడుగురు ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 341, 384, 504, 506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శివచంద్ర వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

Also Read:

AP: అధికార పార్టీ నేతల వేధింపులు.. ఆశా వర్కర్ ఆత్మహత్యయత్నం..

india Corona: కరోనా విజృంభణ.. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు