Govt Liquor shops : ఏపీలోని ప్రభుత్వ మద్యం షాపులలో వరుస దొంగతనాలు.. పలు అనుమానాలకు తావిస్తున్న వైనాలు

|

Jun 29, 2021 | 11:16 PM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోన్న మద్యం షాపుల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వైనం చూస్తుంటే పలు..

Govt Liquor shops : ఏపీలోని ప్రభుత్వ మద్యం షాపులలో వరుస దొంగతనాలు..  పలు అనుమానాలకు తావిస్తున్న వైనాలు
Liquor Shops
Follow us on

Series of Thefts at Govt Liquor shops in AP : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోన్న మద్యం షాపుల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వైనం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల మద్యం షాపుల్లో వరుస దొంగతనాలు పోలీసులను పరుగులెత్తిస్తున్నాయి. ప్రభుత్వ మద్యం షాపులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు కొందరు దుండగులు. కొత్తపేట నియోజకవర్గంలో ముగ్గురు దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు, కొత్తపేట మండలం పలివెల ప్రభుత్వ మద్యం షాపులో దొంగతనం జరిగి వారం రోజులైనా కాకుండానే రావులపాలెంలో మరొక ప్రభుత్వ మద్యం దుఖాణంలో దొంగతనానికి పాల్పడ్డారు.

మరోవైపు, రావులపాలెం శివారు కొత్తపేట రోడ్డులో ఉన్న మద్యం షాపులో మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు దొంగలు వాచ్ మెన్ ని కత్తితో బెదిరించి షాపు షట్టర్ తాళాలు బద్దలు కొట్టారు. లోపల నగదు లేక పోవడంతో సుమారు ఇరవై వేల రూపాయల విలువైన మద్యం సీసాలు దొంగలించుకు పోయారు. వారం రోజుల క్రితం పలివెలలో జరిగిన దొంగతనం ఈరోజు జరిగిన దొంగతనం ఒకే తరహాలో ముగ్గురు వ్యక్తులు పాల్పడటంతో రెండు దొంగతనాలు ఒకే ముఠా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, వాచ్ మెన్ లు ఉన్నప్పటికీ..రెండు చోట్లా దొంగ తనానికి వచ్చింది ముగ్గురు దొంగలు అవ్వడంతో వాచ్ మెన్ లు ఎక్కడా ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.. కొన్నిచోట్ల మద్యం షాపుల్లో నగదును దోచుకెళ్తే మరికొన్ని చోట్ల మద్యం బాటిళ్లను చోరీ చేస్తున్నారు.. జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపుల్లో వరుస దొంగతనాల పై కూపీ లాగుతున్నారు జిల్లా పోలీసులు.

Read also : Lady Ayurveda doctor : హైదరాబాద్ ఆయుర్వేద డాక్టరమ్మని ట్రాప్ చేసి 41లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్