పెరుగుతున్న సాంకేతికతకు తోడు అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు రావడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సెల్ఫీలకు బానిసలవుతున్నారు. దీంతో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. కాగా సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారట. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ పేర్కొంది. సెల్ఫీలు తీసుకోవాలన్న ప్రయత్నంలో నీటిలో మునిగిపోవడం, వాహనాలు గుద్దుకోవడం, ఎత్తైన స్థలాల నుంచి పడిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయని.. దాని వలన వారు ప్రాణాలను కోల్పోతున్నారని ఆ జర్నల్ తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా షార్కు చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కంటే సెల్ఫీల మరణాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆ సర్వే తేల్చింది. కాగా సెల్ఫీల మరణాలు పెరుగుతుండటంతో 16 ప్రాంతాల్లో ఫొటోలు తీసుకోవడంపై ముంబై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.