కృష్ణాజిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. నిరక్షరాస్యులైన ఖాతాదారులే టార్గెట్‌గా భారీ మోసం.. తస్మాత్ జాగ్రత్త..

|

Jan 31, 2021 | 11:30 AM

కృష్ణాజిల్లాలోని ఓ ఎస్‌బీఐ బ్యాంకులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.  ఖాతాదారుల అకౌంట్లలోని 10 లక్షల రూపాయల నగదును కోట్టేశాడు.  నిరక్షరాస్యులైన గ్రామస్తులను టార్గెట్ చేసి అతడు ఈ మోసానికి పాల్పడ్డాడు.

కృష్ణాజిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. నిరక్షరాస్యులైన ఖాతాదారులే టార్గెట్‌గా భారీ మోసం.. తస్మాత్ జాగ్రత్త..
Follow us on

కృష్ణాజిల్లాలోని ఓ ఎస్‌బీఐ బ్యాంకులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.  ఖాతాదారుల అకౌంట్లలోని 10 లక్షల రూపాయల నగదును కోట్టేశాడు.  నిరక్షరాస్యులైన గ్రామస్తులను టార్గెట్ చేసి అతడు ఈ మోసానికి పాల్పడ్డాడు. నాగబాబు అనే బ్యాంకు ఉద్యోగి  34 మంది బ్యాంకు ఖాతాల్లో నగదును మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. లావాదేవీలు జరిగేటప్పుడు ఖాతాదారులకు తెలియకుండా అతడు మోసానికి పాల్పడినట్లు వివరించారు. ఫింగర్ ప్రింట్‌తో ఒక్కో ఖాతానుంచి వేలల్లో మాయం చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఖాతాలలోని డబ్బులు మాయమవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నాగబాబును అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

Also Read:

రైతు ఏడాదంతా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకు ఖాతాలో వేశాడు.. ఐదు నిమిషాల వ్యవధిలో హాంఫట్ చేశారు కేటుగాళ్లు

శుక్రవారం జరిగిన పందాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.. శనివారం తెల్లవారుజూముకల్లా నురగలు కక్కి చనిపోయాయి