Andhra Pradesh: కాకినాడలో విషాదం.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్సై సూసైడ్

|

May 13, 2022 | 10:26 AM

కాకినాడ(Kakinada) జిల్లాలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కాకినాడ రూరల్ సర్పవరం(Sarpavaram) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలకృష్ణ తుపాకీతో కాల్చుకుని...

Andhra Pradesh: కాకినాడలో విషాదం.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్సై సూసైడ్
Sarpavaram Si
Follow us on

కాకినాడ(Kakinada) జిల్లాలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కాకినాడ రూరల్ సర్పవరం(Sarpavaram) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలకృష్ణ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన ఎస్ఐ గోపాలకృష్ణ.. రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణ స్వస్థలం విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువు గ్రామం. 2014 బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయిన గోపాలకృష్ణ ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు భార్యాపిల్లలు నిద్రిస్తున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ పని చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ పరిశీలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్‌ ఫైర్‌ జరిగి మృతిచెందారా? అనేది తేలనుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Gurthunda Sheethakalam: ఎట్టకేలకు  విడుదలకు సిద్ధమైన ఫీల్ గుడ్ లవ్‏స్టోరీ.. థియేటర్లలో సందడి చేయనున్న గుర్తుందా శీతాకాలం..

Vikram Controversy: కమల్‌ హాసన్‌ విక్రమ్ సినిమా సాంగ్‌పై రచ్చ.. కొన్ని పదాలకి భిన్నమైన అర్థాలు..!