Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నారు.. ఆ 4 గంటలు ఏం జరిగింది?

|

Sep 11, 2021 | 12:20 PM

Sai Dharam Tej: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటుడు సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నారు.. ఆ 4 గంటలు ఏం జరిగింది?
Sai Dharam Tej
Follow us on

Sai Dharam Tej: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటుడు సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. తేజ్‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. ముందు జాగ్రత్తగా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ను చూసేందుకు అపోలో ఆస్పత్రికి క్యూ కట్టారు ఫ్యామిలీ మెంబర్స్‌. చిరంజీవి దంపతులు, రాంచరణ్, ఉపాసన తదితరులు అపోలో హాస్పిటల్‌కి చేరుకుని.. సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు.

సాయిధరమ్‌ కండిషన్‌ బాగానే ఉందని..త్వరలోనే కోలుకుంటాడని..అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అల్లు అరవింద్‌. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. సినీ నటి రాశీఖన్నా అపోలో ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్‌ను చూసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తేజ్ కుటుంబసభ్యులనడిగి తెలుసుకున్నారు.

ఆ 4 గంటలు ఏం జరిగింది? మినిట్ టు మినిట్ టైమ్‌లైన్..
నిన్న రాత్రి 7 గంటల 45 నిమిషాలకు జూబ్లిహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 45 నుంచి గచ్చిబౌలికి బయల్దేరాడు సాయిధరమ్‌తేజ్‌. రాత్రి 7 గంటల 58 నిమిషాల సమయంలో కేబుల్‌ బ్రిడ్జి మీదుగా ప్రయాణించాడు సాయిధరమ్‌. రాత్రి 8 గంటలకు కోహినూర్‌ హోటల్‌ దాటి ఐకియా వైపుకు వెళ్తున్నాడు. 8 గంటలు దాటి 5 సెకండ్ల సమయంలో బైక్‌ స్కిడ్‌ అయి కిందపడిపోయాడు సాయిధరమ్‌తేజ్‌. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు 108కి కాల్‌ చేయడంతో 8 గంటల 26 నిమిషాల సమయంలో మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటల 27 నిమిషాలకు దీనిపై 100 ద్వారా వచ్చిన కాల్‌ రిసీవ్‌ చేసుకున్నారు మాదాపూర్‌ పోలీసులు. 8 గంటల 35 నిమిషాలకు మెడికవర్‌ హాస్పిటల్‌కి చేరుకున్నారు పోలీసులు. 8 గంటల 45 నిమిషాలకు మెడికవర్‌ హాస్పిటల్‌లో సాయిధరమ్‌కు చికిత్స ప్రారంభించారు. రాత్రి 9 గంటల సమయంలో మెడికవర్‌ హాస్పిటల్‌కి సాయిధరమ్‌ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు అక్కడి నుంచి అపోలో హాస్పిటల్‌కి తరలించారు. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు అపోలో హాస్పిటల్‌ వైద్యులు.

Sai Dharam Tej

ప్రమాదానికి కారణం అదేనా?
సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ స్కిడ్‌ కావడానికి రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకే కారణంగా తెలుస్తోంది. దీంతో GHMC అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇసుకను శనివారం ఉదయం తొలగించారు. సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాటికి సంబంధించిన ఇసుక, మట్టి రోడ్డుపై పడడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డుపై ఎక్కడా ఇసుక లేదు. కేవలం సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రమే ఇసుక ఉంది. దీంతో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

Also Read..

Sai Dharam Tej Accident: ప్రమాదానికి కొన్ని క్షణలముందు కేబుల్ బ్రిడ్జ్ పై సాయి ధరమ్ తేజ్.. CCTV దృశ్యాలు

Sai Dharam Tej Accident: ఇంత మంచి మనిషికి ఏం కాదు.. త్వరలోనే ఫిట్‌గా ఇంటికి వస్తారు